పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి. పి.ఆర్. ఏ. ఈ లు పనులలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పనులలో నిర్లక్ష్యం కనబడితే చర్యలు :::. జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులను సత్వరమే  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.  శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభివృద్ది పనుల పురోగతి, చెల్లింపులు పై జిల్లా అదికారులు, యం.పి.డి. ఓ లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సి.డి.పి., యం.పి.ల్యాడ్స్, సి.డి.యప్. సి.బి.యప్., డి.యం.యప్.టి. నిధుల ద్వారా జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులలో జాప్యం ఉంటే చర్యలు తప్పవని అట్టి పనులను సత్వరమే పూర్తి చేయాలని అదేశించారు. జిల్లాలో వివిధ పనులకు నిధులు కేటాయించి, అనుమతులు ఇచ్చి నప్పటికీ  సకాలంలో పనులు జరగక పోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే సంబంధిత శాఖ అధికారులు, తహసీల్దార్ల ద్వారా సమస్యలను వెంటనే పరిష్కరించుకొని పనులు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యoగా పి.ఆర్. ఏ. ఈ లు చేపట్టిన పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అలాగే పనుల పురోగతి పై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే  అదికారులు, గుత్తేదారుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులను ఆకస్మిక తనిఖీ చేస్తాని పనులలో పురోగతి కనబడకపోతే చర్యలు తప్పవని అన్నారు.అనంతరం మండలాల వారీగా చేపట్టిన పనుల పై అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తో  కలసి సమీక్షించారు.
    ఈ సమావేశంలో సి.పి. ఓ  వెంకటేశ్వర్లు, ఈ.ఈ. యాకూబ్, వివిధ శాఖల అధికారులు, యం.పి.డి. ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post