పెండింగ్ పనులు త్వరగా పూర్తి చెయ్యాలి. జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య.

జిల్లాలో వివిధ శాఖల ద్వారా మంజూరు అయిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ యస్. కృష్ణ ఆదిత్య ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోప్రజావాణి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, రెవిన్యూ అదనపు కలెక్టర్ వైవి గణేష్ లతో కలిసి ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని వాటికి కారణాలు ఉంటే ప్రజలకు తెలియపరచాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు పెండింగ్ లో ఉండొద్దని
కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం (25) అర్జీలు రాగా, అందులో (07) అర్జీలు రెవెన్యూ శాఖకు చెందినవి,(08) 2 BHK మంజూరు కోరుతూ, మిగిలిన (10) అర్జీలు ఇతర శాఖలకు చెందినవి వచ్చాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ద్వారా మంజూరు అయిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు.

హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలను నర్సరీలలో సన్నద్ధం చేయాలని, రాబోయే వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ కె రమాదేవి, జిల్లా పరిషత్ సీఈవో ప్రసూన రాణి, జిల్లా వైద్యాధికారి ఏ అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, డిపిఓ వెంకయ్య, సిపిఓ ప్రకాష్, డి ఏ ఓ గౌస్ హైదర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్, డి సి ఎస్ ఓ అరవింద్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేష్, ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, బి డబ్ల్యు ప్రేమలత, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, డి సి ఓ సర్దార్ సింగ్, ఎల్ డి ఎం రాజ్ కుమార్, ఎం వి ఐ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post