పెండింగ్ పి.ఓ.బి దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు, 19 ఖమ్మం:

పెండింగ్ పి.ఓ.బి దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. రఘునాథపాలెం మండల తహశీల్దారు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తణిఖీ చేసారు. కార్యాలయంలోని ధరణీ, కంప్యూటర్ విభాగాలను, రికార్డు గదిని పరిశీలించారు. కార్యాలయంలో జరుగుతున్న పి.ఓ.బి దరఖాస్తుల కంప్యూటరైజేషన్ ప్రక్రియను కలెక్టర్ | స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఇప్పటికే అందిన దరఖాస్తులలో ఇంకనూ పెండింగ్లో ఉన్న వాటిపై సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యాలయంలో ఇప్పటికే సిద్ధం చేసిన పి.ఓ.బి ఫైళ్ళను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. కోర్టు కేసులకు సంబంధించిన అంశాలపై పలు సూచనలు, ఆదేశాలు చేసారు. సిబ్బందికి శిక్షణనివ్వడం ద్వారా పనులను మరింత వేగవంతం. చేయాలని పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ తహశీల్దార్ను ఆదేశించారు.

రఘునాథపాలెం మండలం తహశీల్దారు నర్సింహారావు, ఆర్.ఐ శ్రావణ్, కార్యాలయ సిబ్బందికి పి.ఓ.బి. రికార్డుల నిర్వహణ పట్ల పలు సూచనలు, ఆదేశాలు చేసారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post