పెండింగ్ భూ సమస్యలపై సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 20 ఖమ్మం:

పెండింగ్ భూ సమస్యలపై సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ పరిధిలోని పెండింగ్ భూసమస్యలపై కలెక్టర్ సమీక్షించారు. అటవీ- రెవెన్యూ శాఖల వివాదస్పద భూములు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాలకు సంబంధించి ధరణీలో నమోదు కాని విస్తీర్ణం, ఇంకనూ పాస్ పుస్తకాల జారీ, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్తుపల్లి మండలం బేతుపల్లి, పెనుబల్లి మండలం తాళ్ళపెంట, కల్లూరు మండలం రామచంద్రాపురం, లక్ష్మీపురం గ్రామాలలో సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాలలో ఇంకనూ సర్వే చేయాల్సిన భూ విస్తీర్ణం, జారీ చేయవలసిన పట్టాదారు పాస్ పుస్తకాలు, ధరణీలో నమోదు కావాల్సిన విస్తీర్ణంపై తీసుకోవాల్సిన చర్యల గురించి రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆయా మండలాల తహశీల్దార్లకు కలెక్టర్ పలు ఆదేశాలు చేసారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూధన్, ల్యాండ్ సర్వే ఏ.డి. వి. రాము, సత్తుపల్లి ఎఫ్.డి.ఓ సతీష్ కుమార్, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, కల్లూరు, పెనుబల్లి తహశీల్దార్లు మంగీలాల్, రమాదేవి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

 

Share This Post