పెండింగ్ లో ఉన్న ఇసుక రీచ్ లను ప్రారంభించాలి .జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

వార్త ప్రచురణ
ములుగు జిల్లా.
జనవరి 17,2022.

 

పెండింగ్లో ఉన్న ఇసుక రీచ్ లను ప్రారంభించి ముందుకు కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం భూగర్భ వనరుల శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులతో జిల్లా ఇసుక కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశంలో అటవీశాఖ అధికారులు ఇసుక రీచ్ లను ఆపిన రిపోర్టులను అధికారులను వివరించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి లిఖితపూర్వకంగా అటవీశాఖ కు సంబంధించిన ఫారెస్ట్ రిపోర్టులను వివరించారు.

మైనింగ్ ఎడి ఇరిగేషన్ ఈ ఇప్పటివరకు పర్మిషన్ ఇచ్చిన ఇసుక రీచ్ లా వివరాలను నివేదికల రూపంలో తెలపాలని అన్నారు.

కన్నాయిగూడెం ఏటూరునాగారం మండలాలలో ఎకో సెన్సిటివ్ జోన్ హద్దులు వారిగా లేఖ రాసి వారి సలహాలు తీసుకుంటూ పట్టా భూములలో సొసైటీలను ఇసుక రీచ్ లను కొనసాగించాలని అన్నారు.

ESZ పరిధిలో మైనింగ్ చేయటం నిషేధం అని కలెక్టర్ గారు తెలిపిపారు

మంగపేట మండలం లో బ్రాహ్మణపల్లి శివగంగా ఎత్తిపోతల పథకం ఇసుక పర్మిషన్ కొరకు ప్రభుత్యానికి లేఖ తయారు చేయవలసినదిగా అధికారులను ఆదేశించినారు.
పట్టా భూములు ఎంత వరకు ఉన్నాయో డి మార్క్ కేషన్ సర్వే చేసి వాజేడు వెంకటాపురం మండల లో ఇసుక రీచ్ లను కొనసాగించాలని అన్నారు.

ప్రతి ఇసుక పర్మిషన్ వివరాలను అటవీ శాఖ వారిని పంపి వారి నుండి క్లియరేన్సు సూచనలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠీ, డిఆర్ఓ కె రమాదేవి, జిల్లా భూగర్భ వనరుల శాఖ అధికారి రఘు బాబు, ఇరిగేషన్ జగదీష్ డిసిఓ సర్దార్ సింగ్, పెసా జిల్లా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post