*పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను వచ్చే మంగళవారం కల్లా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* *ధరణి, కోర్టు కేసులు, రెవెన్యూ సంబంధిత అంశాలపై తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

*పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను వచ్చే మంగళవారం కల్లా పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*  *ధరణి, కోర్టు కేసులు, రెవెన్యూ సంబంధిత అంశాలపై తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

————————————–
సిరిసిల్ల 22, జూలై 2022
————————————–

జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులపై సంబంధిత మండల తహశీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి, వచ్చే మంగళవారం కల్లా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ తో కలిసి ఆర్డీఓలు, తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారీగా ధరణి దరఖాస్తులు, పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు, పెండింగ్ లో ఉన్న దృవీకరణ పత్రాల మంజూరుపై మండలాల వారీగా సమీక్షించారు. ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను తహశీల్దార్లు పరిశీలించాలని, పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ధరణి దరఖాస్తులు ఆన్ లైన్ చేయడంపై మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో తహశీల్దార్లు ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు.
పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల వివరాలపై ఆరా తీసిన కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా తహశీల్దార్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు.
కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్ లైన్ చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి.లీల, కలెక్టరేట్ పరిపాలన అధికారి గంగయ్య, పర్యవేక్షకులు రాంరెడ్డి, శ్రీకాంత్, సుజాత, రమేష్, రవికాంత్, అన్ని మండలాల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post