పెండింగ్ లో ఉన్న ధరణి మాడ్యూల్స్ వెంటనే పూర్తీ చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 03, 2021ఆదిలాబాదు:-

            పెండింగ్ లో ఉన్న ధరణి మాడ్యూల్స్ వెంటనే పూర్తీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున తన క్యాంపు కార్యాలయం నుండి తహసీల్దార్లు, ఆర్డీఓ, అదనపు కలెక్టర్ లతో ధరణి మాడ్యూల్స్ పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో భూములకు సంబంధించిన ప్రత్యేక గ్రీవెన్స్, వారసత్వం దరఖాస్తులు, పెండింగ్ మ్యుటేషన్ లు, ఆధార్ సీడింగ్, భూసేకరణ వివరాలు, పిఓబి కేసులు, తదితర అంశాలపై మండలాల వారీగా ఆయా తహశీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధరణి మోడ్యూల్స్ పై జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తున్నారని, పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలను ఆయా తహసీల్దార్లు అర్జీలపై వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. సమస్యలకు సంబంధించిన అంశాలపై ఏమైనా సలహాలు సూచనలు అవసరమైన పక్షంలో నేరుగా జిల్లా ఉన్నతాధికారులతో, సంబంధిత విభాగం అధికారులతో చర్చించాలని ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, రాజస్వ మండల అధికారి జాడి రాజేశ్వర్, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post