పెండింగ్ లో ఉన్న ప్రజా పిర్యాదులను సత్వరమే పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.

పెండింగ్ లో ఉన్న ప్రజా పిర్యాదులను సత్వరమే పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన కన్వర్జేన్సి సమావేశం లో మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వివిధ అంశాలకు సంబందించిన సమస్యలు అన్ని శాఖలలో పెండింగ్ ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరమయ్యేటట్లు చూడాలని, ప్రతి వారం  మీ కార్యాలయ  ప్రజావాణి లాగిన్ చెక్ చేసి వచ్చిన దరకస్తులను  పరిష్కరించి పంపించాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం పై, పాతశాలకు  హాజరై  పిల్లల హాజరు శాతం  వివరాలు అడిగి తెలుసుకున్నారు. డి ఇ ఓ మరియు డి ఎం అండ్ ఎచ్ ఓ  సమన్వయనం తో వ్యాక్సినేషన్ పై ప్రత్యెక శ్రద్ధ పెట్టాలని,  ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేలా చూడాలని,  మండలాల్లో స్పెషల్ అధికారులు,  గ్రామ సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ 100 శాతం పూర్తి అయ్యేలా చుడాల్లన్నారు.

అనంతరం ప్రజావాణి పిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు మొత్తం 65  ప్రజా పిర్యాదులు వచ్చాయని , వాటిలో ఎక్కువ  భూ సమస్యలు వచ్చాయని , వాటిని సంబ0దిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరామయ్యేలా చూస్తామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.

సమవేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు, శ్రీహర్ష, రఘు రామ్ శర్మ, ఆర్ డి ఓ రాములు , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

Share This Post