పెండింగ్ లో ఉన్న ప్రజా పిర్యాదులను సత్వరమే పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు

పత్రికా ప్రకటన                                                    తేది 04.10 .2021

పెండింగ్ లో  ఉన్న ప్రజా పిర్యాదులను సత్వరమే పరిష్కారమయ్యేలా   చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన కన్వర్జేన్సి సమావేశం లో మాట్లాడుతూ ప్రజల నుండి  వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వివిధ అంశాలకు సంబందించిన సమస్యలు అన్ని శాఖలలో పెండింగ్ ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరమయ్యేటట్లు చూడాలని, వచ్చిన దరకాస్తులను  పరిష్కరించి రిపోర్ట్ పంపించాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.

ప్రతి గ్రామం లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (సర్పంచ్, అంగన్వాడి టీచర్లు, ఎఎన్ఎం,ఆశా వర్కర్ ,పోలీస్, హెల్త్ ) స్పెషల్ అధికారులతో  ఏర్పాటు చేసి 18 సంవత్సరాల లోపు పిల్లలకు  ఎట్టి పరిస్థితులలో బాల్య వివాహాలు చేయరాదని,  ప్రజా ప్రతినిధులు ,  అధికారులు అందరు సమన్వయంతో చైల్డ్ లేబర్ , బాల్య వివాహాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.  లైన్ డిపార్టుమెంట్స్ అందరు ప్రతి నెల రెండో మంగళవారం చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ నిర్వహించి  సమస్యలను   సమీక్షించాలని తెలిపారు. అతి త్రీవ పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారి తల్లితండ్రులకు పోషణ విలువల పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

 

అనంతరం ప్రజావాణి పిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు మొత్తం 150  ప్రజా పిర్యాదులు వచ్చాయని , వాటిలో ఎక్కువ  భూ సమస్యలు వచ్చాయని , వాటిని సంబ0దిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరామయ్యేలా చూస్తామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.

సమవేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు, శ్రీహర్ష, రఘు రామ్ శర్మ, ఆర్ డి ఓ రాములు , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

 

 

 

 

Share This Post