పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలు , వివిధ అంశాలపై వచ్చిన దరకాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా తాసిల్దార్ లకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                              తేది:30- 7- 2021

       పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలు , వివిధ అంశాలపై వచ్చిన దరకాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా  తాసిల్దార్ లకు ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశము హాలు నుండి  ఏర్పాటు చేసిన  వీడియో కాన్ఫరెన్సు లో మాట్లాడుతూ హెచ్ ఆర్ సి, ఎస్సి, ఎస్టి , లోకాయుక్త , ముక్య మంత్రి  పేషి పిటిషన్లను వెంటనే యాక్షన్ తీసుకొని,  పిటిష్ నర్లకు  ఎండార్స్మెంట్ ఇచ్చి ,  15 రోజులలో క్లియర్ చేయాలనీ అన్నారు. పెండింగ్ లో ఉన్న వాటిని ప్రతి రోజు  ఎన్ని డిస్పోస్  చేస్తున్నారో  రిపోర్ట్ ఇవ్వాలన్నారు. రేషన్ షాప్ లలో  ఉన్న రేషన్ ను క్లియర్ చేసి  చలాన్ ద్వారా పంపించాలని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో గ్రీవెన్స్ కు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించేందుకుఏర్పాటు చేసిన  వీఆర్వోలు  వారి విధులు నిర్వహించేల చూసే  భాద్యత మీదే నని అన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు అవసరమయ్యే ఆదాయం, కులం సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరకాస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు తాసిల్దార్ లాగిన్ లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. తాసిల్దార్ లాగిన్ లో ఉండే ఎస్సీ ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ దరఖాస్తులు  పరిష్కరించాలన్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ బిల్లుల  పై వ్యాలిడ్ డేట్ , స్టాంప్ వేసి,పింక్ కలర్ బిల్లులు మాత్రమె  ఇవ్వాలని, ఏదయినా సమస్య వస్తే ఆర్.డి.ఓ నోటీసు కు తిసుకేల్లాలని అన్నారు.    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మండలాల వారీగా రివ్యూ నిర్వహించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రఘురామ శర్మ, డి.ఎస్.ఓ రేవతి,  ఆర్డిఓ రాములు, ఎ.డి.మైన్స్ అధికారి, లక్ష్మి, జయలక్ష్మి, రాజు,  అన్ని మండలాల తహశీల్దార్లు,తదితరులు  పాల్గొన్నారు.

————————————————————-

 జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల జారీ చేయడమైనది.

Share This Post