*పెండింగ్ లో ఉన్న వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి*

ప్రచురణార్థం—-1

తేదీ.28.1.2022

*పెండింగ్ లో ఉన్న వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి*
*పెండింగ్ లో ఉన్న వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి*

జగిత్యాల , జనవరి,28 :- జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, ఎంసిహెచ్ ఆసుపత్రి లోని అదనపు పడకల భవన నిర్మాణ పనులను అధికారులు, గుత్తేదారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఫిబ్రవరి నెలలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం పర్యటన సందర్భంగా ముందస్తుగా జగిత్యాలలో నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజ్ పనులను జిల్లా కలెక్టర్ రవి పరిశీలించారు.నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ , వీలైనంత త్వరగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

వైద్య కళాశాల పనుల పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు త్వరితగతిన పనులు జరుగుతున్నాయని, అనుమతి అందిన వెంటనే కళాశాల ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.

ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జగిత్యాల ఆర్.డి.ఓ., ఆర్డీ మాధురి, ఆర్&బి ఈఈ శ్రీనివాస్, మెడికల్ సూపరింటెండెంట్ సుదక్షణదేవి, ఆర్.ఎం.ఓ.రామకృష్ణ, సి.పి.ఓ., పూర్ణచందర్ రావు టి.ఎస్.ఎం.ఎస్.ఐ.డి.సి. అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post