పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయలి – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయలి –  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

టి.ఎస్. ఐ పాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయవలసినదిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్ లో ఏర్పాటుచేసిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ టి.ఎస్. ఐపాస్ క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన ధరఖాస్తులలో 9 దరఖాస్తులు వివిధ స్థాయిలలో పెండింగులో ఉన్నాయని అన్నారు. పరిశ్రమల నెలకొల్పనకు ఒక మాసంలోగా అనుమతులు మంజూరు చేయవలసి ఉండగా 9 దరఖాస్తులు కూడా వివిధ శాఖలలో గడువులోపలే ఉన్నాయని అన్నారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి, టి.ఎస్.ఐ.ఐ.సి., విద్యుత్, కర్మాగారాలు,అగ్నిమాపక, గ్రౌండ్ వాటర్, హెమ్.ఏం.డి.ఏ. రెవిన్యూ శాఖాలలో క్లియరెన్స్, ఆమోదం నిమిత్తం ఆ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తమ స్థాయిలో పెండింగు లేకుండా నిర్ణీత గడువులోగా క్లియరెన్స్ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా టి-ప్రైడ్ కార్యక్రమం క్రింద 107 మంది ఎస్సి, ఎస్టీ లబ్దిదారులకు 35 శాతం సబ్సిడీతో 3 కోట్ల 8 లక్షల విలువ గల వాణిజ్య వాహనాలు లబ్ధిదారులకు అందించుటకు కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో 30 ఎస్సి లకు సంబంధించి 84. 67 లక్షలు, 77 మంది ఎస్టీలకు 2 కోట్ల 23 లక్షల 44 వేల విలువ గల వాణిజ్య వాహనాలు అందించనున్నారు.
ఈ సమావేశంలో అదనపు జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, డి.పి .ఓ. తరుణ్ కుమార్, మైన్స్ అండ్ జియాలజీ సహాయ సంచాలకులు జయ రాజ్, డి.ఎస్.డి.ఓ. విజయలక్ష్మి, , ఐ.ఐ.సి. ఈఓ కె.టి.నాయక్, హెమ్.ఏం.డి.ఏ. ప్లానింగ్ అధికారి నీలిమ, రవాణా , విద్యుత్ తదితర శాఖల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post