పెద్దగట్టు జాతరకు సర్వం సిద్దం ఏర్పాట్ల పర్యవేక్షించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగవద్దని ఆదేశం గట్టు పరిసర ప్రాంతాల్లో తిరిగి పనుల పర్యవేక్షణ సౌకర్యాల పై భక్తులను అడిగి తెలుసుకున్న మంత్రి గత ప్రభుత్వం తో పోలిస్తే సౌకర్యాలు బేష్ అన్న యాదవ పెద్దలు, భక్తులు

పెద్దగట్టు జాతరకు సర్వం సిద్దం

ఏర్పాట్ల పర్యవేక్షించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగవద్దని ఆదేశం

గట్టు పరిసర ప్రాంతాల్లో తిరిగి పనుల పర్యవేక్షణ

సౌకర్యాల పై భక్తులను అడిగి తెలుసుకున్న మంత్రి

గత ప్రభుత్వం తో పోలిస్తే సౌకర్యాలు బేష్ అన్న యాదవ పెద్దలు, భక్తులు

సూర్యాపేట
దేశం లోనే రెండవ అతిపెద్ద జతరత్ గా పేరొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ నెల 5 వ తేదీ వ నుండి 9వరకు జరిగే జాతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.. 6కోట్ల 50 లక్షలు నిధులను జాతర ఏర్పాట్ల కోసం కేటాయించామని తెలిపిన మంత్రి, జాతర కు వచ్చే భక్తులు, స్నానాలు ఆచరించే కోనేరు, మంచి నీటి టాంక్, పార్కింగ్ ప్రదేశాలను మంత్రి పరిశీలించారు. ఆసియా లోనే అతి పెద్ద జాతర గా పేరొందిన దురాజ్ పల్లి పెద్ద గట్టు జాతర కు 10 నుండి 15 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా తో ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు. ప్రభుత్వ పరంగా సుమారు కొట్ల రూపాయల నిధులు కేటాయించామని పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగు నీరు, మరుగు దొడ్ల సౌకర్యం వంటి వసతులు కల్పన పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారుల ను కోరారు.. కేసారం గ్రామానికి చెందిన మెంతబోయిన యాదవ వంశస్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
జాతర సౌకర్యాల పై భక్తుల ను ఆరా తీసిన మంత్రి
పెద్ద గట్టు జాతర ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలిస్తున్న క్రమం లో యాదవ కుటుంబాలకు చెందిన భక్తులు మంత్రి తారస పడ్డారు. ఈ క్రమం లో ఏర్పాట్లు ఎలా వున్నాయని మంత్రి వారిని అడుగగా ,గతం తో పోలిస్తే భీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక జాతర.. జాతర కు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు చాలా బాగున్నాయని మంత్రి తెలిపారు. గతం లో ఏ ప్రభుత్వం కూడా జాతర ను పట్టించుకోలేదని , నిధుల లేమితో అర కొర ఏర్పాట్ల మధ్య నే ఇబ్బందికరంగా జాతర కుర్ వచ్చేవాళ్ళం అన్నారు.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, జగదీష్ రెడ్డి సూర్యాపేట కు వచ్చినాక కోట్ల రూపాయల నిధులు ఇచ్చి చేస్తున్న ఏర్పాట్లు చలార్ బాగున్నాయని అన్నారు, మంత్రి జగదీష్ రెడ్డి కి ప్రతీ యాదవ కుటుంబము రుణ పడి ఉంటుందనీ అన్నారు.
మంత్రి తో పాటు పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్,, కౌన్సిలర్లు లక్ష్మీ మకత్ లాల్, బాషా మియా, పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది బిక్షం, జడ్పీటిసి లు సంజీవ నాయక్, జీడి బిక్షం, అంజయ్య, చివ్వెంల వైస్ ఎంపిపి జీవన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉప్పల ఆనంద్, కాచం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Share This Post