పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పనితీరు సంతృప్తికరం – రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పనితీరు సంతృప్తికరం – రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్

ప్రచురణార్థం

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పనితీరు సంతృప్తికరం – రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్
—————————-
పెద్దపల్లి, ఫిబ్రవరి – 01:
—————————-
పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి పనితీరు సంతృప్తికరంగా ఉందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు.

బుధవారం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వాసుదేవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ప్రతి వార్డును సందర్శించి ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో పాటిస్తున్న పారిశుధ్యం, అందుతున్న పౌష్టికాహార వివరాలు, బయటకు మందులు రాస్తున్నారా ఆసుపత్రిలోనే అందిస్తున్నారా, డబ్బు వసూలు ఏదైనా జరుగుతుందా అనే పలు అంశాలను రోగుల నుంచి ఆరా తీశారు. ప్రభుత్వం అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రజల నుంచి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు సంతృప్తికరమైన సమాధానాలు రావడం జరిగింది. వైద్య విధాన పరిషత్ లో ఆసుపత్రి మంచి పనితీరు కనబరుస్తుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేసి డి.సి.హెచ్.ఎస్.ను, డాక్టర్ లను, అధికారులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, ఆన్ డ్యూటీ డాక్టర్లు రాజు, రుక్మిణి, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు
—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post