శుక్రవారం నాడు సర్క్యూట్ గెస్ట్ హౌస్ సమీపంలో
తెలంగాణ ఆల్ పెన్షనర్లు రిటైర్డ్ పెన్షనర్లల అసోసియేషన్ ఆధ్వర్యంలో గల నూతన పెన్షనర్ల సంఘ భవనాన్ని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల అధికార యంత్రాంగం సానుకూలంగా ఉం టుం దన్నారు. వారి ఫిర్యాదులు, విన్నపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని తక్షణమే పెన్షనర్ల సమస్యలు పరిష్కారించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. పదవీ వి రమణ చేసిన ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య ,జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ స్వామి,రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి కృష్ణ మూర్తి,గుజ్జు రాజు,అరుణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు