పెన్షనర్స్ డైరీ ఆవిష్కరణ

తెలంగాణ ఆల్ పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రచురించిన20 22 డైరీ, క్యాలెండర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్ల అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, కరోనా మహమ్మారి అంతం కావడం కోసం తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు తన అనుభవాన్ని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
డైరీ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు, ఉపాధ్యక్షులు ముత్తారం నరసింహ స్వామి, జిల్లా నాయకులు హమీద్ ఉద్దీన్ హనుమాన్లు, పోచ ద్రి, సుదర్శన్ రాజు ,రాధాకృష్ణ ,రాజేశ్వర్ ఎల్ నారాయణ, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్, డైరీ పెన్షనర్లకు చాలా ఉపయోగకరంగా ప్రచురించారని అందుకు సంఘం ను జిల్లా కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.

Share This Post