పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకునే వారికి తగు సమాధానం చెప్పాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు తెలిపారు.

రెండు ఎకరాల భూమి దక్కినందుకు కలెక్టర్కు అభినందనలు తెలిపిన జలగం సోమయ్య. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో తన రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటున్న సోమయ్య భూమికి పట్టా పుస్తకం రాకపోవడంతో, అట్టి వివరాలతో కూడిన దరఖాస్తును సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో సొమయ్య దరఖాస్తు చేసుకున్నాడు, మండల కార్యాలయంలో ఎన్నిసార్లు తెలిపిన పని జరగలేదని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ జరిపి తనకు తెలంగాణ ప్రభుత్వ పట్టా పుస్తకాన్ని అందజేశారని తన సంతోషాన్ని వెలబుచ్చారు. ఈరోజు జరిగిన ప్రజావాణిలో జలగం సోమయ్య వచ్చి అదనపు కలెక్టర్, జిల్లా అధికారులకు మిఠాయిలు పంచిపెట్టాడు. ప్రజల సమస్యలకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని సోమయ్య సంతోషం వ్యక్తం చేశాడు.

Share This Post