పెబ్బేరు, కంచిరావుపల్లి, కంబాలపురం, శ్రీరంగాపురం, వెంకటాపురం గ్రామాలలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్నిపరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

పత్రిక ప్రకటన, వనపర్తి,  28, అక్టోబర్. 2021.

అర్హత కలవారు ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండకూడదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం జిల్లాలోని పెబ్బేరు కంచిరావుపల్లి కంబాల పురం శ్రీరంగాపురం వెంకటాపురం గ్రామాలలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటికి వెళ్లి ఆ కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన వారి సమాచారం, కోవిడ్ టీకా తీసుకున్న, తీసుకోని వారి వివరాలు సేకరించాలని, ఇప్పటి వరకు టీకా తీసుకోని వారికి మొదటి డోస్ ఇప్పించాలని, మొదటి డోస్ తీసుకుని ఉండి రెండవ డోస్ తీసుకోని వారికి వెంటనే ఇప్పించాలని అన్నారు. సంబంధిత వార్డులో స్పెషల్ ఆఫీసర్ పర్యటించాలని, ఆశ, అంగన్వాడీ,  సిబ్బంది గల టీం లు ప్రతీ ఇంటిలోని వారి సమాచారం సేకరించాలని అన్నారు. వార్డుల్లో ఆటోల ద్వారా ప్రచారం చేస్తూ, వ్యాక్సిన్ అందించాలని, ప్రతీ ఇంటిని టచ్ చేయాలని అన్నారు. అన్ని గ్రామల్లోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతవైద్య సిబ్బందిపై ఉందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను వెంటనే యాప్ లో అప్లోడ్ చేయాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సంప్రదించేందుకు వైద్యాధికారి సెల్ నెంబర్ తెలపాలని అన్నారు. ముందస్తు ప్రణాళికలతో ప్రతి ఒక్కరికీ టీకా పంపిణీ జరగాలని అన్నారు. జిల్లాలో 4 లక్షల 28 వేల మంది ఉండగా, ఇంకా 1 లక్షా48 వేల మందికి క్సిన్ వేయాలని అన్నారు. రెండవ డోసు చేయించుకోవడం లో ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. ఎవరూ అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. గ్రామ సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇతర ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని నవంబర్ 3 నాటికి జిల్లాలో 100% టార్గెట్ పూర్తి చేసేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

……………… జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post