పత్రికా ప్రకటన. తేది:15.11.2021, వనపర్తి.
లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
సోమవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని లేఅవుట్లను జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లేఅవుట్లు క్రమబద్ధీకరించడానికి కమిటీ పర్యవేక్షణ జరిపి, క్రమబద్ధీకరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ రాజ్ (పి.ఆర్) ఈ.ఈ, ఆర్ అండ్ బి ఈ. ఈ, నీటిపారుదల శాఖ ఈ.ఈ, విద్యుత్ శాఖ ఎస్.ఈ, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్, పెబ్బేరు తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.