పెరఫార్మెన్సు ఇండికేటర్స్ పై నివేదికలు పంపాలి.. అదనపు కలెక్టర్ రమేష్

పెరఫార్మెన్సు ఇండికేటర్స్ పై నివేదికలు పంపాలి.. అదనపు కలెక్టర్ రమేష్

వివిధ శాఖల ద్వారా అమలవుచున్న కార్యక్రమాలపై ప్రగతి నివేదికలను (పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ప్రతి నెల 5 వ తేదీలోగా ముఖ్య ప్రణాళిఖాధికారికి పంపవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా సాధించిన ప్రగతిపై ప్రతి నెలా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సమీక్షించి ర్యాంకులు ఇస్తున్నదని అన్నారు. మంగళవారం తన ఛాంబర్ లో మండల స్థాయి లో అభివృద్ధి సూచికల (పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) పర్యవేక్షణ పై మొదటిసారిగా ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీలో సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఆయా శాఖలకు మండల వారీగా నిర్దేశించిన లక్ష్యం, సాధించిన ప్రగతిపై ప్రతి నెల 5 వ తేదీ లోగా నివేదికలను నిర్ణీత నమూనాలో పంపవలసినదిగా రమేష్ సూచించారు. ప్రధానంగా విద్య, వైద్య,కుటుంబ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, ఎస్సి, ఎస్టీ అభివృద్ధి, డ్డి.ఆర్.డి.ఏ. వ్యవసాయం, విద్యుత్, గృహనిర్మాణం, రోడ్లు రహాదారులు, పంచాయత్ రాజ్, లీడ్ బ్యాంక్ ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాలపై మండల వారీగా పెర్ఫార్మన్స్ ను సమీక్షిస్తూ ర్యాంకులు ఇస్తున్నదని ఆయన తెలిపారు. కాబట్టి అధికారులు ఎందులో వెనుకంజలో ఉన్నామో గుర్తించి అందుకు గల కారణాలను వివరిస్తూ పనితీరును మెరుగు పరుచుకోవాలని అన్నారు. నివేదికలు పంపేటప్పుడు మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించు కోవాలని సూచించారు. వివిధ శాఖల ద్వారా వచ్చిన నివేదికలను క్రోడీకరించి సంబంధిత వెబ్ పోర్టల్ లో ప్రతి నెల 10 వ తేదీలోగా అప్ లోడ్ చేయవలసినదిగా ఆయన ముఖ్య ప్రణాళిఖాధికారికి సూచించారు.
ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిఖాధికారి చిన్న కొట్యా నాయక్, ఆర్ అండ్ బి ఈ ఈ శ్యామసుందర్, విద్యుత్ శాఖా డివిజనల్ ఇంజనీరు కృష్ణ రావు, వ్యవసాయ శాఖా, విద్య, మహిళా శిశు సంక్షేమం, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖా నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post