పేదరికం పారద్రోలేందుకు ఆర్థిక ప్రగతి పెంచేందుకు నిరంతరం కృషి చేయాలి…

ప్రచురణార్థం

పేదరికం పారద్రోలేందుకు ఆర్థిక ప్రగతి పెంచేందుకు నిరంతరం కృషి చేయాలి…

మహబూబాబాద్ నవంబర్ 25.

స్వయం సహాయక సంఘాల ద్వారా పేదరికాన్ని రూపుమాపేందుకు వారి ఆర్ధిక ప్రగతి పెంచేందుకు నిరంతరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యకలాపాలయిన 7 అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 16 మండలాల లో 15 వేల 343 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని 670 గ్రామైక్య సంఘాలు ఉన్నాయని వీటిలో1,63,124 మంది సభ్యులు ఉన్నారని వీరి ఆర్థిక ప్రగతి పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

బ్యాంక్ లింకేజీ, పింఛన్లు, సదరం, స్త్రీ నిధి, ఈజీఎంఎం సెల్ఫ్ కార్యకలాపాలు పై సమీక్షిస్తూ నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు కృషి చేయాలన్నారు.

రుణాలు పొందటం కాకుండా వాటిని వ్యాపారపరంగా వినియోగించుకొని రాణించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.

చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పు కునే విధంగా యూనిట్లను మంజూరు చేయించే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు తద్వారా రుణాల చెల్లింపు కూడా వేగవంతంగా ఉంటుందన్నారు.

వ్యవసాయ భూమి పై ఆధారపడిన వారికి పాడి పరిశ్రమ వంటివి మంజూరు చేయించి వారి ఆర్ధిక ప్రగతికి బాటలు వేయాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, డి పీ ఎం లు ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
———————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post