పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

ఏప్రిల్ 30 ఖమ్మం:

పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రూ. 73:39 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సమగ్ర చనుపాల నిర్వహణ కేంద్రం “మదర్ మిల్క్ బ్యాంక్”, నూతన మార్చురీ గదిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి ప్రారంభించి, రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని వ్యాధులను గుర్తించే అధునాతన పరిజ్ఞానం కలిగిన వైద్య పరికరాలు, అన్ని వ్యాధులకు చికిత్సనందించే నిపుణులైన వైద్యులు ఉన్నారని, గుండె జబ్బులకు చికిత్సకు గాను ఇటీవలే కార్డియాలజీకి సంబంధించి క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. నేడు ప్రారంభించుకున్న ‘మదర్ మిల్క్ బ్యాంకు ద్వారా తల్లిపాలు సేకరించి బలహీనమైన పిల్లలకు పంపిణీ హైదరాబాద్, వరంగల్ తర్వాత ఖమ్మంలోనే ఏర్పాటు చేయడమైందన్నారు. తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమైనవని, ప్రసవం జరిగిన వెంటనే బిడ్డకు పాలు పట్టించాలి. అని, పుట్టిన బిడ్డ కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తల్లిపాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. కానీ ప్రసవం తర్వాత అనేక మంది తల్లులకు పాలు పడడం లేదని, గర్భిణులుగా ఉన్నప్పుడు పౌష్టికాహార లోపం ఒక కారణమైతే మరికొందరిలో జీవన వ్యవహారం, మానసిక స్థితి మరో కారణమని వైద్యులు పేర్కొంటున్నారని వివరించారు. దవాఖానలో ప్రసవించిన మహిళల నుంచి, బయటి బాలింతల నుంచి తల్లిపాలను సేకరించి అదే హైజినిక్ పద్ధతులతో పాటు రాని బాలింతలకు అందించడం జరుగుతుందన్నారు. ఖమ్మం పెద్దాసుపత్రిలో రోజుకు 20 నుంచి 40 వరకు కాన్పులు జరుగుతున్నాయని, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అనేక మంది తల్లులకు ప్రసవం జరిగిన వెంటనే పాలు పడడం లేని కారణంగా చారంలోపు పనివాళ్లకు తల్లిపాలే తాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మదర్ మిల్క్ బ్యాంక్లు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ఈ తరహా విధానం హైదరాబాద్ నీలోఫర్ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇటీవలే వరంగల్లోనూ ప్రారంభించారని, నేడు ఈ సౌకర్యం ఖమ్మంలోనూ మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చామని వివరించారు. కాగా పసి బిడ్డలకు పాలు పట్టించే కేంద్రంగా రాష్ట్రంలోనే ఖమ్మం మూడవస్థానంలో నిలువడం గర్వంగా ఉందన్నారు. మనిషి చనిపోయిన తర్వాత భౌతిక కాయాన్ని భద్రపరచడం, ఏవైనా పోలీసు కేసులు నమోదైతే పోస్టుమార్టం కోసం ఖమ్మం పెద్దాసుపత్రిలో అత్యాధునిక మార్చురీ గదిని నిర్మించడం జరిగిందన్నారు. ప్రస్తుత గది అసౌకర్యంగా ఉన్నందున వైద్యాధికారులు విషయాన్ని పలు మార్లు తన దృష్టికి తీసుకువచ్చారని అందుకే నూతన గదిని నిర్మించామన్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలోనే రూ.75 లక్షలతో నిర్మించనున్న రేడియాలజీ భవనాన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దీనిలో అల్ట్రాసౌండ్, సిటీస్కాన్, ఎంఆర్బ, మెమోగ్రామ్, ఎక్స్ విభాగాల సేవలన్నీ రోగులకు ఒకేచోట లభించనున్నాయని, తద్వారా రోగం కచ్చితంగా నిర్ధారణ అయి రోగులకు చికిత్సలు మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాలకమల్ రాజ్, సుదా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి దా॥మాటతీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా॥ బీ వెంకటేశ్వర్లు, ఆర్. ఎం.వో బొల్లికొండ శ్రీనివాసరావు, వైద్యులు, కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి అధికారులు, గుత్తేదారులకు పలు ఆదేశాలు చేసారు..

Share This Post