పేదలకు లబ్ధి చేకూర్చే ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరాయంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె. చంద్రశేఖర్రావు నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వారు. అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 26 ఖమ్మం:

పేదలకు లబ్ధి చేకూర్చే ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరాయంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె. చంద్రశేఖర్రావు నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వారు. అజయ్ కుమార్ తెలిపారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సలు అనంతరం ముఖ్య మంత్రి సహాయ నిధికి ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన 32 మందికి గాను రూ.12.99లక్షల విలువైన చెక్కులను వీ.డి.ఓస్ కాలనీ మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో నేటి వరకు 1813 చెక్కులకు గాను రూ.7.73 కోట్లు పంపిణీ. చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

అనంతరం ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలో మంజూరైన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాది ముభారక్ పథకం క్రింద రూ.15.01 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేస్తారు.

అంతకు ముందు వీధి వ్యాపారులు ఒకే సముదాయంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా. తమ వ్యాపారాలను నిర్వహించేకునేందుకు వీలుగా నగరంలోని 9 వ డివిజన్ రోటరీ నగర్లో రూ. 37 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల దుకాణ సముదాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం 36, 46 వ డివిజన్ నయాబజార్ సర్కిల్ వద్ద రూ.38.60 లక్షలతో నిర్మించనున్న వీధి వ్యాపారుల దుకాణ సముదాయానికి మంత్రి శంఖుస్థాపన చేసారు.

కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డి. లక్ష్మీప్రసన్న, నగరపాలక సంస్థ ఎస్. ఆంజనేయ ప్రసాద్, ఆయా డివిజన్ల కార్పోటరేటర్లు యస్.కె.జానీ, రాంమోహన్ రావు, వైష్ణవి, కమర్తపు మురళి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post