పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ సంజీవని సిద్ధిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4753 మంది లబ్ధిదారులకు రూ.19 కోట్ల 66 లక్షల 63 వేల 234 రూపాయల మేర ఆర్థిక భరోసా. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 31 మందికి రూ.12, 25, 500 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య మంత్రి హరీశ్ రావు


పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ సంజీవని

సిద్ధిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4753 మంది లబ్ధిదారులకు రూ.19 కోట్ల 66 లక్షల 63 వేల 234 రూపాయల మేర ఆర్థిక భరోసా.

సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 31 మందికి రూ.12, 25, 500 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య మంత్రి హరీశ్ రావు

=======================
సిద్దిపేట 23 మార్చి 2022 :
=======================

పేదల ఆరోగ్యం పాలిట సంజీవని సీఎం సహాయ నిధి పథకం తోడ్పాటును ఇస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని 31 మందికి రూ.12, 25, 500 రూపాయల విలువ కలిగిన సీఎంఆర్ఏఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని, ఎటువంటి కష్టమొచ్చినా ఆత్మీయ భరోసా ఇస్తున్నామని తెలిపారు.
ఆపత్కాలంలో.. ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు కార్పొరేట్‌ వైద్యంతో స్వస్థత పొందేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం ఎంతో తోడ్పాటును అందిస్తున్నదని పేర్కొన్నారు.
ఆరోగ్యంలో పేదలకు ఇబ్బంది కావొద్దని సిద్దిపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రయివేటు దవాఖానకు పోయి అనవసరంగా మీ డబ్బులు వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు లభిస్తున్నాయని అక్కడికి వెళ్లి సేవలు పొందాలని ప్రజలను కోరారు.
కాలి నొప్పి నుంచి కార్డియో దాకా ప్రథమ చికిత్స నుంచి ప్రాణాంతకమైన వ్యాధుల వరకూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు, రూ.8కోట్ల రూపాయల వ్యయంతో క్యాథ్ ల్యాబ్ మిషనరీ తెప్పించబోతున్నట్లు తెలిపారు.
ఆపదలో ఆపన్న హస్తాన్ని అందిస్తూ పేదలకు అండగా నిలుస్తు నిరంతర సేవలను కొనసాగిస్తామని, ప్రజా ఆరోగ్యమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చెప్పారు.
ఇలాంటి చికిత్సలు ప్రయివేటులో చేపించుకుని ఆర్థిక భారం పడిన పేద ప్రజలకి ఆర్థిక ఆత్మీయ భరోసానే సీఎం సహాయ నిధి ఉన్నదని తెలిపారు.

– సిద్ధిపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4వేల 753 మంది లబ్ధిదారులకు రూ..19 కోట్ల 66 లక్షల 63 వేల 234 రూపాయల మేర ఆర్థిక భరోసా కల్పించాం.

– ఇవాళ సిద్దిపేట నియోజక వర్గంలోని చిన్నకోడూర్-9 మందికి రూ.3,85 లక్షలు, నంగునూరులో ముగ్గురికి రూ.1.80 లక్షలు, నారాయణరావుపేటలో ముగ్గురికి రూ.52, 500 వేలు, సిద్ధిపేట రూరల్ లో ఒక్కరికీ రూ.55వేలు, సిద్ధిపేట అర్బన్ లో ఒక్కరికీ రూ.60 వేలు, పట్టణంలో 14 మందికి రూ.4, 93 లక్షల చొప్పున మొత్తం 31 మంది లబ్ధిదారులకు 12 లక్షల 25 వేలు 500 రూపాయల విలువ చేసే ఆర్థిక భరోసా ఇచ్చాo. కార్యక్రమంలో మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post