పత్రికా ప్రకటన తేది:26- 9 -2021
జోగులాంబ గద్వాలజిల్లా
పేదల తరఫున పెత్తందార్ల తో పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ వీరత్వానికి నిదర్శనమని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య అన్నారు.
ఆదివారం వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేదల తరపున పెతందారులతో పోరాడిన ఐలమ్మ తెలంగాణా వీరత్వాన్నికి నిదర్శనమన్నారు. అప్పటి కాలంలో ‘’ నీ కాళ్లు మొక్కుతా” అనే మాట నుండి “నువ్వెంటి ‘’ అని ప్రశ్నించే విధంగావీరనారి ఐలమ్మ మార్పు తీసుకు వచ్చారని తెలిపారు. తెలంగాణా ఉద్యమానికి చాకలి ఐలమ్మ పోరాటమే స్పూర్తి అన్నారు. చాకలి ఐలమ్మను మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఐలమ్మ కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలని కలెక్టర్ గారిని కోరుతామని ఆమె తెలిపారు. వచ్చే జయంతి లోపు ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న అదనపు కలెక్టర్ రఘురామ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా అయిలమ్మ జయంతి ఉత్సవాలు నిర్వహించడం శుభసూచకం అన్నారు. ప్రతియేటా ప్రభుత్వం తరఫున ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. సామాజిక పరిస్థితులలో స్త్రీ నిమ్న స్థాయి నుండి పురుషాధిక్యత సాధించడంలో ఐలమ్మ మహిళలకే ఆదర్శంగ నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐలమ్మ చరిత్రను వెలికితీసి పేద ప్రజలకు ఆమె చరిత్ర ను వివరించే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని అన్నారు. జిల్లాలో ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు స్థలం సేకరించి వచ్చే జయంతి నాటికి విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తదనంతరం పలువురు రజక సంఘ సభ్యులు మట్లాడుతూ మన జిల్లా లో చాకలి ఐలమ్మ కంష్య విగ్రహన్ని ఏర్పాటు చేయాలనీ కోరారు.
———————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారీ చేయబడినది.