పేద ఇంటి ఆడపడచులకు పుట్టింటి సారెగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందిస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పేద ఇంటి ఆడపడచులకు పుట్టింటి సారెగా ప్రభుత్వం బతుకమ్మ చీరలను
అందిస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

శనివారం తుక్కు గూడ పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల
పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  ప్రతి
పేదింటి ఆడబిడ్డలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర
ప్రభుత్వం పుట్టింటి సారెగా బతుకమ్మ చీరల అందిస్తున్నారు. అర్హులైన తెల్ల
రేషన్ కార్డు కలిగి ఉండి పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి
ఆడపడుచుకు చీరలను అందిస్తున్నదని అన్నారు.

అదే విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా
కళ్యాణ లక్ష్మి/ షాదీముబారక్ పథకాల ద్వారా లక్షా నూట పదహారు రూపాయల
ఆర్థిక సహాయం అందిస్తున్నదని,  కెసిఆర్ కిట్ ద్వారా ఆడపిల్ల పుడితే
పదమూడు వేల రూపాయలు, మగపిల్లవాడు పుడితే పన్నెండు వేల రూపాయలు అందజేయడం
జరుగుతుంది అని అన్నారు. తాగునీటి సౌకర్యం లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు
గుర్తించి ఆడబిడ్డలు ఎలాంటి కష్టాలు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మీషన్
భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చేయడం
జరిగిందని అన్నారు.

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 7 లక్షల 29 వేల బతుకమ్మ చీరల పంపిణీ చేయడం
జరుగుతుందని, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఐదు వేల చీరలను పంపిణి
చేస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు మరిచిపోకుండా బతుకమ్మ, దసరా
పండుగలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నామన్నారు

దాదాపు 16 వేల మగ్గాలపై పది వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి
చీరలను తయారు చేశాయాన్నారు.

,*ప్రభుత్వం అందిస్తున్న ఈ చిరు కానుకను ఆడపడుచులు స్వీకరించి తోడ బుట్టిన అన్న
అందించే సారెగా భావించి ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు.*
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మదన్ మోహన్, వైస్ చైర్మన్ వెంకట
రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, పిడి డి ఆర్ డి ఎ ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post