పేద ఇంటి ఆడపడుచులకు బతుకమ్మ దసరా పండుగ కనుక . నేడు రాష్ట్రవ్యాప్తంగా , బతుకమ్మ చీరల పంపిణీ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి.

పత్రికా ప్రకటన                                                        తేది: 2-10-20 21

పేద ఇంటి ఆడపడుచులకు బతుకమ్మ  దసరా పండుగ కనుక .

 

నేడు రాష్ట్రవ్యాప్తంగా , బతుకమ్మ చీరల పంపిణీ ఎమ్మెల్యే  కృష్ణ మోహన్ రెడ్డి.

 

ధరూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా  గాంధీజీ  152వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి గారు గాంధీ జీ  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన  బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి హాజరై  మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలకు రానీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వానికి వచిందని, తెలంగాణా సంప్రదాయం ప్రకారం తెలంగాణ  ముఖ్యమంత్రి గారు  పేదల ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగిందని ,   18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి   చీరల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

 

తెలంగాణ రాష్ట్రంలోని మహిళల కోసం గౌరవ ముఖ్యమంత్రి  కెసిఆర్ గారు  బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు.     289 రకల డిజైన్స్ వివిధ రకాల    చేనేత మగ్గం తో బతుకమ్మ చీరలు తయారు చేయుటకు ప్రభుత్వం 317 కోట్లు వ్యయం తో  ఖర్చు చేసి మహిళలందరికీ నేటి నుంచి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి  చీరలను అంగన్ వాడి టీచర్స్ అందజేస్తారని తెలిపారు.

 

ఈ కార్యక్రమం లో ఎంపీపీ నజూన్నీసబేగం, జడ్పిటిసి పద్మా వెంకటేశ్వర్ రెడ్డి,  వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచులు పద్మ,   ఎంపీటీసీలు శివలీల, దేవన్న, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నర్సింహులు, PD DRDO ఉమాదేవి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్  ED రమేష్ బాబు, MRO,MPDO,  తదితరులు పాల్గొన్నారు

 

————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయబడినది.

Share This Post