పేద ప్రజలకు చేయూత నివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం క్రిష్టమష్ గిఫ్ట్స్ అందజేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అన్నారు

పేద ప్రజలకు చేయూత నివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం  క్రిష్టమష్ గిఫ్ట్స్ అందజేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అన్నారు.

శనివారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల మైనార్టీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో  క్రైస్తవ పాస్టర్ల తో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో అయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అందించే గిఫ్ట్ ప్యాక్ లు, బట్టల పంపిణి కోసం జిల్లా లో ప్రతి నియోజికవర్గానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలనీ, కమిటి లో ప్రసిడెంట్, చైర్ పర్సన్ లు ఉంటారని,  జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారని, సోమవారం వరకు కమిటీ ఏర్పాటు కు సంబంధించిన ప్రతిపాదనలు పూర్తి చేయాలనీ తెలిపారు. జిల్లాలో ఉన్న  నిరుపేద కుటుంబాలకు,  HIV వ్యాధి బాధితులను , అంగవైకల్యం కలిగిన వారిని, అనాథలు, వితంతువు కుటుంబాలు, అతి బీద కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పాస్టర్లకు తెలిపారు. జిల్లా లోని ఆలంపూర్, గద్వాల్ రెండు నియోజికవర్గాలలో ప్రతి నియోజికవర్గానికి 1000 గిఫ్ట్ ప్యాక్ లు, 2 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. క్రిస్టమస్ పండుగ సంబరాలలో బాగంగా ఏర్పాటు చేసే విందు భోజనాలలో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బిర్యానీ, రైతా, కేకులు, స్వీట్ లు, కచ్చితంగా మెనూ లో ఉండాలని, ప్రతి లొకేషన్ లో 500 మందికి విందు భోజనాలు ఏర్పాటు చేయాలనీ తెలిపారు.  అన్ని చర్చి వారికీ ప్రాదాన్యతనివ్వాలని , తహసిల్దార్ల ద్వారా మండలాల్లో ఉన్న అనాథలను, నిరుపేద కుటుంబాలను , వికలాంగులను గుర్తించి,అర్హులైన వారికీ గిఫ్ట్ పాక్స్ అందించే విదంగా చూడాలని  అన్నారు.

సమావేశం లో  మైనార్టీ వెల్ఫేర్ అధికారి ప్రసాద రావు, ఎం ఆర్ ఓ లక్ష్మి , బెనహ రాజ్,ప్రకాష్,అరుణ్, యేసయ్య,భాష్కర్, దేవరాజ్, ఎసంన, వజ్రపాన్ని, కృపాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  జిల్లా గారిచే జారీ చేయనైనది.

 

Share This Post