పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను వైద్యాధికారులు తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లింగాలు కమలరాజు సూచించారు.

ప్రచురణార్ధం

12 ఖమ్మం:–

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను వైద్యాధికారులు తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లింగాల కమలరాజు సూచించారు. గురువారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిట్ చైర్మన్ లింగాల కమలరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన అనుపత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంజూరు చేయడం జరిగిందని ఖమ్మం జిల్లాకు వైద్య కళాశాల రావడం మంచి పరిణామమని మెడికల్ కళాశాలకు సరిపడ వసతులు ఉన్నందున వైద్య కళాశాల రావడం జరిగిందని. ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలకు కావాలసిన రో గనిర్ధారణ అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చుకోవడం  జరిగిందని, హైద్రాబాదు తరువాత మన ఖమ్మం జిల్లాలోనే గుండెకు సంబంధించి స్టంట్ అమర్చే క్యాథ్ ల్యాబ్ ను  ఇటీవలే ప్రారంభించుకొని గుండె జబ్బులకు ప్రత్యేక వైద్యుని నియమించుకొని ఉచితంగా వైద్యం చేయడం. జరుగుతుందని, ప్రధాన ఆసుపత్రికి అనుసంధానంగా సత్తుపల్లి, మధిర, పెనుబల్లి ఇతర సి హెచ్ మోదల్ ఆన్లైన్ ఈ.సి.జి మిషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా ఆన్లైన్లో రిపోర్టు వెంటనే తెలుసుకోవడం జరుగుతుందని వెంటనే కావాల్సిన వైద్య చికిత్స చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. టి, డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా జిల్లా కేంద్రంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రోగుల రక్త నమూనాలు సేకరించి 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను చేయడం జరుగుతుందన్నారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రోగికి, ఆయా విభాగాల వైద్యులకు సెల్ ఫోన్స్ కు సందేశం రావడం తదనుగుణంగా రోగికి తగిన వైద్యం అందించడం సులభతరం అవుతుందన్నారు. మన జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరిసర జిల్లా సూర్యాపేట, మహాబుబాబాద్, కొత్తగూడెంకు ప్రజలకు వైద్య సేవలందించడం గర్వకారనమని తెలిపారు. రేడియాలజీ ల్యాబ్ కు శంఖుస్థాపన చేసుకోవడం జరిగిందని, రాబోయో రోజుల్లో ఎం.ఆర్.ఐ మిషన్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో హైద్రాబాదు తరహాలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని వైద్య పరికరాలు సమకూర్చుకోవడం జరిగిందని అన్ని విభాగాలకు సంబంధించి నిష్ణాతులైన వైద్యులు ఉన్నారని ఎటువంటి వ్యాధులనై న నయం చేసుకునే సౌకర్యం ఉందని. తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కూడా భాగస్వాములై తమ గ్రామాలలో ప్రజలకు కార్పోరేటు ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్యం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో అందించడం జరుగుతుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనివ్వందం జరుగుతుందని విషయాన్ని తెలియజేయాలన్నారు.

ప్రపంచ నర్సింగ్ డే సందర్భంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నర్సింగ్ సిబ్బందిని జిల్లా కలెక్టర్ బి.పి.గౌతమ్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు సన్మానించారు.

జిల్లా వైద్య ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి.వెంకటేశ్వర్లు, ఆర్.ఎం.ఓ.బి. శ్రీనివాసరావు, రఘునాథపాలెం జడ్పీటి.సి. మాళోతు ప్రియాంక, చింతకాని జడ్పీటిసి కిషోర్, ముదిగొండ ఎం.పి.పి. హరిప్రసాద్, కమిటీ సభ్యులు, వైద్య అధికారులు, సిబ్బంది తదిరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post