పత్రికా ప్రకటన తేది : 22-4-20 22
పేద ప్రజల ఆరోగ్యమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కొరకు నిరంతరం ప్రభుత్వ పరంగా అన్ని విధాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరుగుతుందని జెడ్పి చైర్ పర్సన్ సరిత అన్నారు.
శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శవాగార భవన మరమ్మత్తు నూతన షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన మరియు చిన్నపిల్లల చికిత్స వార్డు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు జడ్పీ చైర్ పర్సన్ సరిత , స్థానిక శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి ముఖ్యఅతిథులు గా హాజరయ్యారు. జెడ్పి చైర్ పర్సన్ సరిత, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి లో శవాగార భవన మరమ్మత్తు నూతన షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అనంతరం చిన్నపిల్లల చికిత్స వార్డు ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ గద్వాల్ ప్రజలు గతంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కర్నూలు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందేవారని, కానీ నేడు దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, చికిత్సలు అందిస్తుందని, ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి లోనే 56 డయాగ్నోసిస్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, డయాలసిస్, గుండెపోటు, వంటి సమస్యలతో పాటు వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన ఉచిత పరీక్షలు, మందులు అందజేయడం జరుగుతుందని , అన్ని వ్యాధులకు సంబంధించిన వైద్యులు ప్రస్తుతం మన ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన ప్రత్యేక గదులను ఏర్పాటుచేసి, వారికి అన్ని సౌకర్యాలను కల్పించి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నారులకు చికిత్స అందించే విధంగా , ఆసుపత్రిలో బెడ్డు సౌకర్యము, సకాలంలో వైద్యులు అందుబాటులో ఉండి, ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రం లో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చి దిద్దుతామని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన చికిత్స అందజేస్తామని తెలిపారు. ఆసుపత్రి లో చేపడుతున్న శవాగార భవన మరమ్మత్తు నూతన షెడ్ పనులను అన్ని వసతులతో పూర్తి చేయాలని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దామని అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, సూపరింటేన్దేంట్ డాక్టర్ కిషోర్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.