పేద ప్రజల వైద్య చికిత్సల ఆర్థిక సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 8 కోట్ల 27 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగిందని రాష్ట్ర రవాణా. శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 20 ఖమ్మం:

పేద ప్రజల వైద్య చికిత్సల ఆర్థిక సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 8 కోట్ల 27 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగిందని రాష్ట్ర రవాణా. శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వివిధ అనారోగ్యకారణాల చేత శస్త్ర చికిత్సలు, వైద్య సేవల ఆర్ధిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి ప్రత్యేక చొరవతో 47 మందికి మంజూరు కాబడిన ముఖ్యమంత్రి సహాయ నిధి 19 లక్షల 80 వేల రూపాయల విలువగల చెక్కులను సోమవారం వీడియోస్ కాలనీ క్యాంప్ కార్యాలయంలో మంత్రి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయకుమార్ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పోరేట్ వైద్యాన్ని అందిస్తున్నదని వైద్యసేవలకై ప్రజలకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశ్యంతో వివిధ శస్త్రచికిత్సలు, వైద్యసేవలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు అందిస్తున్నారని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రజా ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు గాను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 1942 మందికి దాదాపు 8 కోట్ల 50 లక్షలకు పైగా అందించడం. జరిగిందని మంత్రి తెలిపారు.

సంబంధిత డివిజన్ల కార్పోరేటర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post