పేపర్ వర్క్ ను తగ్గిస్తూ పోలింగ్ స్టేషన్ పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే గరుడ యాప్ ను బూత్ లెవెల్ ఆఫీసర్లు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు.

పేపర్ వర్క్ ను తగ్గిస్తూ  పోలింగ్ స్టేషన్ పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే గరుడ యాప్ ను బూత్ లెవెల్ ఆఫీసర్లు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. స్పెషల్ సమ్మరి రివిజన్ లో భాగంగా  నవంబర్, 1వ తేదీ ప్రామాణికం తో ఇటీవల విడుదల చేసిన  ఓటర్ జాబితా నవీకరణ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు నిన్న నారాయణపేట జిల్లాలో పర్యటించిన  ఎన్నికల అధికారి ఆదివారం జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, ఎస్పీ డా. చేతన తో కలిసి ఊట్కూరు మండలంలో పర్యటించి పలు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు.  నవంబర్, 27, 28 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ఓటరు నమోదుకు, మార్పులు, చేర్పులు, మరణించిన వారి పేరు తొలగింపు లకై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.  ఈ కార్యక్రమాల్ని పరిశీలించిన ఆయన బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  పేపర్ వర్క్ తగ్గించి పోలింగ్ స్టేషన్ కు సంబంధించి అక్షఅంశా, రేఖంశా, ఫోటోలు డిజిటల్ విధానం ద్వారా అప్లోడ్ చేసేందుకు ఎన్నికల కమిషన్ గరుడా యాప్ ను  రూపొందించిందన్నారు.  ఈ యాప్ ను మొబాయిల్ లో డౌన్లోడ్ చేసుకొని వచ్చిన దరఖాస్తులు, పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు  యాప్ లో నమోదు చేయాలన్నారు.

ఆదివారం ఊట్కూర్ మండల కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల,  సెంట్రల్ ప్రైమరీ స్కూల్ లో ఉన్న పోలింగ్ బూత్ నెంబర్ 32,33,34,35,36,37,38,39,40  లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్ దరఖాస్తులను సేకరించడాని కి ఉన్న BLO ల ద్వారా ఎన్నికల అధికారి వివరాలను తెలుసుకున్నారు. కొత్త ఓటర్ల నమోదు కై వాడవలసిన ఫారములు,  ఓటరు పేరు మార్పు, పోలింగ్ బూత్ మార్పు మరియు  మరణించిన వారి ఓటర్లు గుర్తించి గరుడ యాప్ లో నమోదు చేశారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఇదివరకు సేకరించిన వాటిని స్థానిక తహశీల్దార్ లేదా యాప్ ద్వారా నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో  ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ తిరుపాతయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post