పైలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రణాళిక బద్ధంగా నివారణ చర్యలు తీసుకోవాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

పైలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రణాళిక బద్ధంగా నివారణ చర్యలు తీసుకోవాలి::జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం
అక్టోబర్ 17 మహబూబాబాద్

జిల్లాలో పైలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రణాళిక బద్ధంగా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష
అభినవ్ తో కలిసి
వైద్య ఆరోగ్యశాఖ, అనుబంధ శాఖల అధికారులతో ఈనెల 20వ తేదీన చేపట్టనున్న ఉచిత మాత్రల పంపిణీ కార్యక్రమం పై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పైలేరియా (బోదకాలు) కేసులు అధికంగా ఉన్న గ్రామాలను, పట్టణాలలోని వార్డులను గుర్తించి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ఇప్పటికి గుర్తించిన పైలేరియా కేసులు వాటి నివారణకు తీసుకున్న చర్యలు,
ప్రతి సంవత్సరం పెరుగుతున్న కేసుల సంఖ్య గ్రామాల వారీగా మున్సిపాలిటీలోని వార్డుల వారీగా సమగ్ర సమాచారం సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
గత సంవత్సరం సబ్ సెంటర్ వారీగా తీసుకున్న శాంపిల్స్, నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి సంవత్సరం ఒకే ప్రాంతంలో కాకుండా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఫైలేరియా నివారణ చర్యలు తీసుకోవాలని గతంలో గుర్తించిన కేసులకు సంబంధించి తీసుకుంటున్న వైద్య సేవలు ,నివారణ చర్యల సమగ్ర సమాచారం కలిగి ఉన్నప్పుడే వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందకుండా అరికట్టగలుగుతామని కలెక్టర్ అన్నారు.

రెండు సంవత్సరాల పైబడిన వారందరూ వ్యాధి నివారణ మాత్రలు తీసుకునే విధంగా ప్రణాళిక బద్ధంగా పంపిణీ జరగాలని,
రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ,గర్భిణీ స్త్రీలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రలను ఇవ్వరాదని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈనెల 20వ తేదీన పైలేరియా నివారణ మాత్రల పంపిణీ అనంతరం ఈనెల 21 22వ తేదీలలో కూడా కొనసాగించాలని కలెక్టర్ అన్నారు.

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల ను ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి విస్తృత అవగాహన కల్పించాలని, అదేవిధంగా వ్యవసాయ
విస్తరణ ధికారులు, మండల వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు,
సైన్స్ ,బయాలజీ ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు ,
సంక్షేమ శాఖ ద్వారా వసతిగృహాలలోని విద్యార్థులకు అవగాహన కల్పించి
అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మాత్రలు పంపిణీ జరిగే విధంగా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్ ,
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్మద,
జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి ,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రునాయక్,
డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంబరీష్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న సంబంధిత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post