పొడుభూముల హక్కుల పరిరక్షణ లో పారదర్శకతకు పెద్ద పీట : రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి

తేదీ.06.11.2021.
సూర్యాపేట.

అటవీ భూముల పరిరక్షణ అందరి బాధ్యత

పొడుభూముల హక్కుల పరిరక్షణ లో పారదర్శకతకు పెద్ద పీట

అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు

సోమవారం నుండి గ్రామ సభలు నిర్వహణ.

రాజకీయాలకు అతీతంగా అర్హులకు న్యాయం.

రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

అటవీ భూముల పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పొడుభూముల హక్కుల పరిరక్షణ లో పారదర్శకత కు పెద్ద పీట ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాల్లో అర్హులైన గిరిజనులకు ROFR హక్కు పత్రాలను అండించుటల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అడవుల సంరక్షణ…పొడు భూముల పై ఏర్పాటు చేసిన అఖిల పక్షం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని అందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో అఖిల పక్షం తో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తద్వారా అఖిల పక్షం అభిప్రాయ లకు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో హుజూర్ నగర్ నియోజక వర్గంలో గల మండల్లాల్లైన చింత ల్ల పాలెం, మెళ్ళ చేర్వు, మట్టం పల్ల్లి, పాలకి డు లలో 570 మంది రైతులు 1545.15 ఏకరాల అటవీ భూమిని సాగు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా జిల్లాల్లో జిల్లా స్థాయి కమిటీ, సబ్ డివిజన్ కమిటీ అలాగే ఫారెస్ట్ రైట్స్ కమిటీ చట్ట ప్రకారం ఉంటాయని తెలిపారు. జిల్లాల్లో రెవెన్యూ, ఫారెస్ట్ భూముల సరిహద్దులకు సరిగా లేక కొంత మేరకు ఇబ్బందులూ వస్తున్నాయని ఇకపై పూర్తి స్థాయిల్లో సర్వే చేయించడం జరుగుతుందని అన్నారు. జిల్లాల్లో వచ్చే సోమవారం నుండి గ్రామ సభ లు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చట్టం పై అవగాహన కల్పించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. అట్టి దరఖాస్తులను తద్వారా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు అందిస్తామని అన్నారు. జిల్లాలో అటవీ శాతం 4 శాతం ఉన్నందున అటవీ సంపదను పెంచేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు అందించుటల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
అనంతరం యం. పీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోడు, అటవీ సంరక్షణపై అఖిల పక్షం సమావేశం ఏర్పాటు ను స్వాగతిస్తున్నామని రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం గిరిజన, గిరిజ నేటరులకు హక్కు పత్రాలు అందించాలని అలాగే 2008 లో కొందరికి కొన్ని సమస్యలు వలన హక్కు పత్రాలు అందలేదని ఆ ప్రక్రియను కొనసాగించాలని కోరారు. అలాగే రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిజమైన అర్హులకు హక్కు పత్రాలు అందించుట లో పారదర్శకంగా ఉందని అన్నారు. అనంతరం zptc లు, ఎంపీపీ ల్లు వారి మండలాల్లో గల్ల సమస్యలను వివరించారు..
ఈ సమావేశంలో శాసన సభ్యులు సైది రెడ్డి, యస్.పి. రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, dfo ముఖుండ రెడ్డి, DTWO శంకర్, RDO లు రాజేంద్ర కుమార్, కిషోర్ కుమార్, వెంకా రెడ్డి, జెడ్ పి వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, బీజేపీ నుండి అబిద్, cpi నుండి వెంకటేశ్వర్లు,సీపీఎం నుండి రవి నాయక్, తహశీల్దార్లు, అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post