పొడు భూములకు శాశ్వత పరిష్కారం :

 

ప్రచురణార్థం
ములుగు జిల్లా :
అక్టోబర్ 22 ( శుక్రవారం )
పొడు భూములకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అటవీ శాఖ ప్రత్యేకకార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.
శుక్రవారం రోజున ములుగు జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొoగ్దు, సిఎం ఓఎస్డి ప్రియాంక వర్గిస్ , పి సి సి ఎస్ శోభ, అదనపు పి సి సి ఎఫ్ మోహన్ చంద్ర లు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లాకు విచ్చేసిన వీరికి జిల్లా పాలనాధికారి కృష్ణ ఆదిత్య స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ములుగు,భూపాల పల్లి, వరంగల్, మహబూబాబాద్, జిల్లాలకు సంబంధించిన ,పోడు భూములు సమస్యలు అడవుల పరిరక్షణ హరితహారం అంశాలపై ఆయా జిల్లాల జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్ డి వోలు, అటవీశాఖ అధికారులు, డి ఎఫ్ఓ లు , రెవెన్యూ మరియు గిరిజన సంక్షేమ శాఖ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించనైనది.

ఈ సమీక్ష సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అటవీ భూములను పరిరక్షించాల్సిన భాద్యత అధికారుల దే నని, ములుగు,భూపాల పల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లా లో ఎక్కువ అటవీ ప్రాంతం ఎక్కువ గా ఉన్నదని, ఏ ఏ తెగలు నివాసం ఉంటున్నారని, ఇకనుంచి ఎకరం కూడా అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాకుండా చూడలని , ప్రభుత్వ ఆదేశాల మేరకు యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అటవీ రెవెన్యూ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని, ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి గతంలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఎంత మందికి ఎన్ని ఎకరాలకు పట్టాలు అందించారు అనే దానిపై సమగ్ర సమాచారం అందించాలని అన్నారు. పోడు సాగుదారులకు న్యాయం చేయాలనే అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆలోచన చేస్తున్నారని దానికి దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు.
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చాంగ్తు
మాట్లాడుతూ పోడు భూముల అడవుల సంరక్షణ హరితహారం సంబంధిత విషయాలపై ప్రభుత్వ నియమ నిబంధనలు ఆర్ వో ఎఫ్ ఆర్ యాక్ట్ లో ఉన్న అంశాలను తూచా తప్పకుండా పాటించాలని వారు అన్నారు. పోడు భూముల సమస్యలపై ,పీసా చట్టం కింద ఏయే గ్రామాలు ఉన్నాయి, గ్రామ సభల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సి ఉందని వారు అన్నారు.
ఈ సందర్భంగా సిఎం ఓస్ డి ప్రియాంక వర్గిస్ మాట్లడుతూ ములుగు భూపాల పల్లి ,వరంగల్లు మహబూబాబాద్ జిల్లాల్లో అటవీ భూమి ఎక్కువగా ఉన్నందున ఫారెస్ట్ భూములు మరియు రెవెన్యు భూములను కాపాడవలసిన భాద్యత అధికారులదని పోడు భూముల విషయంలో ప్రజలను ఇబ్బదులకు గురిచేయవద్దన్నది సియం గారి ఆకాంక్ష అని వారు అన్నారు. ప్రజలకు నచ్చజెప్పి వారి జివనోపాదికి ఇబ్బంది లేకుండా వారికీ నచ్చ జెప్పే ప్రయత్నం చేయాలి అని వారు అన్నారు. ఈ పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు అన్నారు.
ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఉన్న అటవీ విస్తీర్ణం పోడు భూములు సమస్యలు, హరితహారం సంబంధిత విషయాలపై ఉన్నతాదికరులకు వివరిస్తూ పై అధికారుల ఆదేశాల తూచా తప్పకుండా పాటిస్తూ సమర్థవంతమైన పాలన లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. అటవీ ,రెవెన్యూ చట్టాలతో పాటు అటవీ పరిరక్షణ కు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తూoదనే నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ దిశ గా సమాలోచనలు చేస్తున్నారని అన్నారు.

ఈ సమావేశంలో ములుగు, భూపలపల్లి , వరంగల్ ,మహబూబాబాద్ , జిల్లాల కలెక్టర్లు, ఎస్. కృష్ణ ఆదిత్య, గోపి, శేశాంక్ జిల్లాల అదనపు కలెక్టర్లు, డిఎఫ్ ఓ లు, ఆర్డీఓలు, డిటిడిఓ లు, తహశీల్దార్లు, ఎఫ్ ఆర్ ఓ లు, తదితరు లు పాల్గొన్నారు.

Share This Post