పొడు సమస్యకు శాశ్వత పరిష్కారం అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

పొడు భూముల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక అందించిందని ఆయన చెప్పారు.అందులో బాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు.ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పొడు భూముల సమస్యకు తెరదించే ప్రయత్నంలో భాగంగ ఏర్పాటైన ఉపసంఘానికి కోనసాగింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం రోజున ఆయా జిల్లాలలో జిల్లా కలెక్టర్ లతో పాటు అదనపు కలెక్టర్లు,అటవీశాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో బాగంగా శనివారం సాయంత్రం సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో నల్లగొండ, సూర్యపేట,భోనగిరియదాద్రి జిల్లాల కలెక్టర్లు,అదనపు కలెక్టర్లతో పాటు మూడు జిల్లాల అటవీశాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పొడు భూములను సాగు చేసుకుంటున్న వారి వివరాలు పకడ్బందీగా సేకరించాలని ఆయన చెప్పారు. ఆ దిశగా అటవీ,రెవిన్యూ,గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యహరించాలన్నారు.సమగ్ర అధ్యయనం మీదట ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయం మేరకు అర్హులైన లబ్ధిదారులకు పొడు భూములపై హక్కులు కలిగించ నున్నట్లు ఆయన వెల్లడించారు.ఈ సమీక్షా సమావేశంలో సూర్యపేట,నల్లగొండ,
యాదాద్రి జిల్లాల కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, ప్రశాంత్ జీవన్ పాటిల్,పమేలా సత్పతి అదనపు కలెక్టర్ లు మోహన్ రావు,శ్రీనివాస్ రెడ్డి,చంద్రశేఖర్ లతో పాటు మూడు జిల్లాల అటవీశాఖ అధికారులు ముకుందరెడ్డి, రాంబాబు,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పొడు సమస్యకు శాశ్వత పరిష్కారం
అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు శ్రీకారం.
రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి.

Share This Post