పోక్సో బాధితులకు పరిహారం చెల్లింపుకు జాబితా అందచేయడంలో నిర్లక్ష్యం వహించిన సిడిపిఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో మహిళా శిశు సంక్షేమ ధివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆదర్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ యూనిట్ మరియు చైల్డ్ లైన్ అడ్వైజరీ బోర్డు ఫార్మేషన్ మీటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోక్సో కేసులు భాదితులకు పరిహారం అందచేయడంలో జాప్యం జరగడానికి వీల్లేదని, జాబితా ఇవ్వడంలో జాప్యం కారణంగానే పరిహారం చెల్లింపు జరగలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిడిపిఓలపై చర్యలు తీసుకోవాలని సంక్షేమ. అధికారికి సూచించారు. పరిహారం చెల్లింపులో ఎందుకు జాప్యం జరుగుతున్నదని, ప్రాజెక్టు వారిగా జాబితా అందచేయాలని చెప్పారు. బాలల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని బాల రక్షక కేంద్రాలపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలు మేర నిర్వహిస్తున్నారా లేదా పర్యవేక్షణ చేయాలని, తనిఖీ నివేదికలను ప్రతి నెలా తనకు నివేదికలు అందచేయాలని చెప్పారు. బాలలపై జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు తెలియచేసేందుకు గ్రామస్థాయిలో రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, సర్పంచుల సహాకారం. తీసుకోవాలని చెప్పారు. ఏదేని సంఘటన జరిగితే నిర్భయంగా 1098 నెంబరుకు ఫోన్ చేయాలనే సమాచారాన్ని క్షేత్రస్థాయి వరకు చేర్చాలని చెప్పారు. గ్రామస్థాయి నుండి మండలస్థాయిలో బాలరక్ష కమిటి సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. మణుగూరులో బాల రక్ష భవనం మరమ్మత్తులు నిర్వహణకు తక్షణం ప్రతిపాదనలు అందచేయాలని, జనవరి 15 వరకు ఈ కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలని చెప్పారు. బాలలను పనిలో పెట్టుకున్న వ్యాపారులకు జరిమానాతో పాటు పోలీసు కేసులునమోదు చేయాలని చెప్పారు. ప్రతి దుకాణంలో బాల కార్మికులు లేరని సమాచారంతో పాటు బాలకార్మికులుంటే 1098కి తెలియచేయాలని సమాచారపు బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. బాలలతో పనులు చేపిస్తే పోలీసులు కేసులు నమోదు చేయాలని బాలలు ఉండాల్సింది బడిలో అని పనుల్లో కాదని ఆయన స్పష్టం చేశారు. చైల్డ్ లేబర్ టాస్క్ ఫోర్సు కమిటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. దత్తత తీసుకున్న చిన్నారులను వాపసు ఇచ్చే వ్యక్తులను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరుగకుండా పోలీసు కేసులు నమోదు చేయాలని చెప్పారు. దత్తత పిల్లల యొక్క సంరక్షణ చర్యలను ఆయా జిల్లాలు, రాష్ట్రాల సంక్షేమ అధికారులు ద్వారా పర్యవేక్షణ చేపించాలని చెప్పారు. నియమ నిబంధనలు ప్రకారం దత్తత తీసుకున్న తదుపరి వారసులుగా నమోదు కావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చైల్డ్ లైన్ నెంబరుకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలు జరిగిన మండలాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారంతో పోలీసులు తక్షణమే కేసులు నమోదు చేయాలని చెప్పారు. ఆపరేషన్ స్మైల్, ముష్కాన్ కార్యక్రమాల ద్వారా గుర్తించిన బాలల పర్యవేక్షణ చేయాలని చెప్పారు. కోవిడ్ వల్ల మరణించిన ఐదుగురు చిన్నారులకు ఆర్ధిక సాయం కొరకు ప్రధానమంత్రి కేర్ నిధికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. బాలల సంరక్షణ కేంద్రాల్లో ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని, ప్రతి నెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని వైద్యాధికారికి సూచించారు. బాలరక్ష కమిటీలను గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలన్నారు. ఆర్ఫాన్స్, సెమీ ఆర్ఫాన్స్ చిన్నారులను రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యనభ్యసించు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాలల సమాచారం తెలియచేసేందుకు రైల్వే స్టేషన్లులో హెల్స్ డెస్క్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, డిఆర్డిఓ మధుసూదనాజు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడి ముత్యం, డివియం భవాని ప్రసాద్, కార్మిక అధికారులు రవి, రాజు, బాలల హక్కుల సంరక్షణ అధికారి హరికుమారి, ఇన్స్పెక్టర్ బాలక్రిష్ణ, బాలచెలుగు పిడి సాయిసంగీత, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు సుమిత్రాదేవి, అంబేద్కర్, సాధిక్పాష, సా మేనేజర్ చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share This Post