పోటీతత్వం నైపుణ్యాన్ని, జ్ఞాన పటిమను పటిష్టవంతం చేస్తుంది జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

పోటీతత్వం నైపుణ్యాన్ని, జ్ఞాన పటిమను పటిష్టవంతం చేస్తుంది

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0 0000

            పోటీతత్వం మనలో నైపుణ్యాన్ని,జ్ఞాన పటిమను పటిష్టవంతం చేస్తుందని  జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.

            స్వాతంత్య్రాన్ని సాధించి 75 సంవత్సరాలు గడిచిన శుభ సందర్బంగా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా  క్రీడా పోటిలలో గెలుపొందిన క్రీడా కారులకు గురువారం అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్,నగర  పోలీస్ కమీషనర్  లు బహుమతులను ప్రధానం చేశారు.  ఈ సందర్బంగా  అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన 17 సంవత్సరాల బాలుర వాలిబాల్, బాలికల ఖోఖో ఆటలను వీక్షించారు.   అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ,  ఈ క్రీడిపోటిలలో దాదాపు 980 మంది క్రీడాకారులు  పాల్గోనడం గోప్పవిషయమని, ఈ క్రీడా పోటిలలో జిల్లాకు చెందిన 16 మండలాల బాల,బాలికలతో పాటు సిపి మరియ కలెక్టర్ టీం లు సైతం పోటిల్లో పాల్గోన్నారని పేర్కోన్నారు.   క్రీడా పోటిల్లో గెలుపొందడం ముఖ్యం కాదని, పాల్గోనడం గొప్పవిషయంగా గుర్తించాలని అన్నారు.  ఆటల పోటీల ద్వారా సానుకూల దృక్పథం  పెంపొందుతుందని, తద్వారా మీ నైపుణ్యాలను పెంపొందిచుకోగలుగుతారని తెలిపారు.  100 మీటర్ల పరుగు పందాన్ని ఒక్కరు కూడా పూర్తిచేయగలుగుతారని, కాని అదే పరుగుపందాన్ని ఒక బృందంతో కలిసి నిర్వహించినప్పుడు మునుపటికన్న తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోగలుగుతారని  అన్నారు,  జిల్లాలో నిర్వహించిన ఫ్రీడం రన్  కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించుకోవడం జరిగిందని, ఇందులో పాల్గోన్న ప్రతిఒక్కరికి కలెక్టర్ ఈ సందర్భంగా  అభినందించారు.

            నగర పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ, 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్బంగా అందరికి శుభాకాంక్షలను తెలియజేశారు.  దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి స్వాతంత్ర్యా సాధనకు కృషిచేసి అసువులు బాసిన ప్రతిఒక్కరిని స్మరించుకోవాలనే  ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహిస్తుందని తెలియజేశారు.  ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలో విద్యార్థిని విద్యార్థులతో పాటు పోలీస్, కలెక్టర్ సిబ్బంది మద్య పోటీలను నిర్వహించడం జరిగిందని పేర్కోన్నారు.   ప్రతిఒక్కరు క్రీడాపోటీల్లో పాల్గోనడం ద్వారా శారీరక దృడత్వంతో పాటు చురుకుదనాన్ని కూడా పొందగులుగుతారని పేర్కోన్నారు.

             అనంతరం ఖోఖో, కబడ్డి, వాలిబాల్ ఆటలు ఆడి గెలుపొందిన వివిధ టీంల విన్నర్  మరియు రన్నర్ లతో పాటు పోలీస్, కలెక్టర్ టీంలకు షీల్డ్ లను ప్రదానం చేశారు.

            ఈ కార్యక్రమంలో జిల్లా ఆదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, లా ఆండ్ ఆర్డర్ డిసిపి ఎస్. శ్రీనివాస్, ఎసిపి ప్రతాప్, జిల్లా ప్రణాళిక అధికారి కొమరయ్య ,జిల్లా క్రీడా అభివృద్ది అధికారి రాజవీర్, జిల్లా పంచాయితి అధికారి వీరబుచ్చయ్య, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి,  తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.

Share This Post