TSRTC – WARANGAL REGION Press Release— 01-05-2022
పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న నిరుద్యోగ యువతకు ఆర్టీసీ వారి చేయూత
రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న నిరుద్యోగులకు వారు ఇంటినుండి కోచింగ్ సెంటర్ కు సిటీ మరియు మెట్రో ఎక్ష్ప్రెస్స్ బస్సులలో వెళ్ళడానికి ఆర్టీసీ వారు 20% తగ్గింపు తో రాయితీతో కూడిన బస్సు పాస్ సౌకర్యం కల్పించానైనది. వాటి వివరాలు ఏమనగా…
GBT సిటీ ఆర్డినరీ 3 నెలల బస్సు పాస్ కొరకు ₹.3450/- గల విలువ ను కేవలం ₹.2800/- చెల్లించి బస్సు పాస్ పొందగలరు. అదే విధంగా GBT మెట్రో ఎక్ష్ప్రెస్స్ 3 నెలల బస్సు పాస్ కొరకు ₹.3900/- గల విలువ ను కేవలం ₹.3200/- చెల్లించి బస్సు పాస్ పొందగలరు.
ఇట్టి బస్సు పాస్ లను పొందడానికి దరఖాస్తు దారు సంతకం చేసిని ఆధార్ జిరాక్స్ తో పాటు కోచింగ్ సెంటర్ ఐడెంటిటీ కార్డు జిరాక్స్ లేదా నిరుద్యోగ గుర్తింపు కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకొని ఏదేనీ సమీప డిపో కు చెందిన బస్సు పాస్ కౌంటర్ లో పొందవచ్చును.
కావున నిరుద్యోగ యువత ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించు గోగలరని మనవి. ఇతర వివరములకు 040-23450033, 69440000 సంప్రదించండి.
మీ…
రీజినల్ మేనేజర్,
వరంగల్ రీజియన్.