DPRO ADB-పోడుభూములపై అవగాహన కార్యక్రమాలు, క్లెయిమ్ ల ఫారాల పంపిణి రేపటి లోగా పంపిణి చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పోడుభూములపై అవగాహన కల్పించడంతో పాటు క్లెయిమ్ ఫారాలను పంపిణి చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున తన క్యాంపు కార్యాలయం నుండి అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, పంచాయితీ, అటవీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని పోడు భూములు సాగు చేస్తున్న వారికీ అవగాహన కల్పించడం, క్లెయిమ్ ఫారాలను అందించడం రేపటిలోగా పూర్తిచేయాలని అన్నారు. పోడు భూముల సమస్య ఎప్పటి నుండో ఉందని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అట్టి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా హాబిటేషన్ ల వారీగా అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 12 నుండి క్లెయిమ్ ఫారాలను క్రమ పద్దతిలో తీసుకొని ప్రతి అర్జీదారునికి రశీదును అందించాలని, ప్రతి దరఖాస్తు ఫారాన్ని రిజిస్టర్ లో నమోదు చేయాలనీ అన్నారు. క్లెయిమ్ ఫారాల పంపిణి వేగవంతం చేయాలనీ, మండల టీమ్ లు, హాబిటేషన్ లను పర్యటించి అవగాహన కార్యక్రమాలు, క్లెయిమ్ ఫారాల పంపిణి విధానాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉత్పన్నం అయినచో జిల్లా అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం అటవీ, రెవెన్యూ, పంచాయితీ అధికారులతో మండలాల వారీగా టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, గ్రామసభలకు సంబంధించి మినిట్స్ ను రిజిస్టర్ లో నమోదు చేయాలనీ అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ పెట్ల, ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, అటవీ రేంజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post