పోడు, అడవుల సంరక్షణ, హరితహారం అంశాలపై రాష్ట్ర స్థాయి అధికారుల బృందం సమీక్ష

పోడు భూముల సమస్యలు, క్షేత్రస్థాయిలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రస్థాయి బృందం సమీక్షించింది. గురువారం రోజున ఉట్నూర్ లో ని కొమురం భీం  కాంప్లెక్స్ లో గల పి ఎం ఆర్ సి సమావేశ మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి  జిల్లాల కలెక్టర్లు, అటవీ, రెవిన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి నుంచి అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి పి సి సి ఎఫ్ శోభ, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా చాంగ్దు, ముఖ్యమంత్రి కార్యాలయం OSD ప్రియాంక వర్గీస్, అదనపు పి సి సి ఎఫ్ మోహన్ చంద్ర పర్గెన్ లు  జిల్లా అధికారులతో పోడు భూములు, అటవీ సంరక్షణ, హరితహారం అంశాలపై సమీక్షించారు.  అటవీ భూముల సంరక్షించుకునేందుకు అధికారులు వారి పరిధిలో తీసుకుంటున్న చర్యలు, స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసు కుంటూ వారికి ఇతర మార్గాల ద్వారా ఉపాధి కల్పించడం జరుగుతున్నదని, పలు జిల్లాల అధికారులు వివరించారు. అటవీ భూముల సంరక్షణకు. ప్రత్యామ్నాయ చర్యలకు పలు సూచనలు అందించాలని రాష్ట్ర స్థాయి అధికారులు సూచించారు. ఈ సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి పూర్ణిమ మాట్లాడుతూ, ఆడ్డ ఘాట్ గ్రామంలో సుమారు 2 వందల ఎకరాలు అటవీ భూమి లో పోడు వ్యవసాయం చేస్తున్నారని వారిని రెలోకెట్ చేయడానికి ప్రయత్నం చేయగా, అధికారుల మాటలు మన్నించి ఇతర ప్రాంతాలకు వెళ్లడం జరిగిందని వారికి వెదురు బుట్టలు తయారుచేయడం వంటి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, మంచేరియల్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, భారతి హొలీ కెరీ, ముషారఫ్ అలీ ఫారూఖ్, రాహుల్ రాజ్, సంగీత సత్యనారాయణ, జితేష్ పాటిల్, అదనపు కలెక్టర్లు, డిఎఫ్ ఓ లు, ఆర్డీఓలు, డిటిడిఓ లు, తహశీల్దార్లు, ఎఫ్ ఆర్ ఓ లు, తదితరు లు పాల్గొన్నారు.

Share This Post