పోడు దరఖాస్తుల కంప్యూటరీకరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్ధం

పోడు దరఖాస్తుల కంప్యూటరీకరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కొత్తగూడ,
మహబూబాబాద్, 2021 డిసెంబర్ – 02:

పోడు భూముల హక్కు పత్రాలకై లబ్దిదారులు ఇచ్చిన దరఖాస్తులను కంప్యూటర్ లో అప్లోడింగ్ ప్రక్రియ తొందరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టర్ కొత్తగూడ తహసల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోడు భూముల దరఖాస్తుల వివరాలను కంప్యూటర్ లో అప్లోడ్ చేస్తున్న విధానాన్ని పరిశిలించారు. అప్లోడ్ చేసిన దరఖాస్తు కాపీ ప్రింట్ తీసుకొని వివరాలను దరఖాస్తుదారు సమర్పించిన దరఖాస్తు ప్రకారం సరిగా అప్లోడ్ చేశారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. దరఖాస్తులను సమర్థవంతంగా అప్లోడ్ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడ తహశీల్దార్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post