పోడు దరఖాస్తుల నమోదు ప్రక్రియను మండల ప్రత్యేక అధికారులు పరిశీలన చేయాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు పోడు దరఖాస్తులు స్వీకరణ, జాబ్ మేళా విజయవంతం, ఎమ్మెల్సీ ఎన్నికలకు నోడల్ అధికారులు నియామకం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల సమస్య పరిష్కారానికి హాబిటేషన్లు వారిగా స్వీకరిస్తున్న దరఖాస్తులను రిజిష్టరులో నమోదులు చేసి దరఖాస్తు దారునికి రశీదు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 18వ తేదీ వరకు పోడు భూముల సమస్య పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందని, అప్పటి వరకు ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి, కులాల వారిగా విస్తీర్ణపు వివరాలు నమోదును మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. దరఖాస్తు దారుల సమగ్ర వివరాలు చాలా ముఖ్యమని చెప్పారు. ఈ నెల 6వ తేదీన ప్రగతి మైదానంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని, జాబ్ మేళా నిర్వహణలో ఉపాధి కల్పనాధికారి విజేత అవిరళ కృషితో దిగ్విజయంగా నిర్వహించగలిగామని అభినందించారు. అనుకున్నదానికంటే పెద్ద సంఖ్యలో యువత వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చక్కటి ఏర్పాట్లు చేశారని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకు వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించుకునేందుకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నిరుద్యోగ యువతకు జీవనో పాధిని కల్పించుటతో పాటు పని చేసే విధానంలో మెలకువలు చాలా అవసరమని ఆ దిశగా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు.

 

ఈ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం పర్యవేక్షణ అధికారి శరణ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post