పోడు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18వ తేదీ వరకు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. పోడు దరఖాస్తులు స్వీకరణ, ధరణి, నిషేదిత భూముల సంరక్షణ తదితర అంశాలపై క్యాంపు కార్యాలయం నుండి రెవిన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల లోపల. నివసించే ప్రజలకు పోడు భూముల సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపై అవగాహన ఉ ండదని, సమాచారం కూడా వారికి సరిగా తెలియకపోవచ్చునని కాబట్టి అటువంటి వారికి తెలియచేసి వారి నుండి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. ఏ ఒక్కరి నుండి దరఖాస్తు తీసుకోలేదన్న పిర్యాదు మనకు రావొద్దని ఆయన సూచించారు. ఈ నెల 17వ తేదీ వరకు పోడు భూమి సమస్య ఉన్న అన్ని ఆవాసాల ప్రజల నుండి అటవీ హక్కుల కమిటి క్లెయిమ్స్ స్వీకరణ జరుగుతుందని, ఏదేని కారణాల వల్ల క్లెయిమ్స్ ఇవ్వని వారికి ఒక రోజు అనగా 18వ తేదీన అవకాశం కల్పించినట్లు చెప్పారు. 18వ తేదీతో క్లెయిమ్స్ స్వీకరణ పూర్తయివుతుందని కావున ప్రజలు సకాలంలో క్లెయిమ్స్ ఇవ్వాలని, ఇట్టి అవకాశాన్ని పోడు దారులు సద్వినియోగం చేసుకుని క్లెయిమ్స్ను అందచేయాలని చెప్పారు. పోడు సమస్యలపై కలెక్టరేట్ ని కంట్రోల్ రూముకు వస్తున్న పిర్యాదులను సంబంధిత మండలాల తహసిల్దార్లకు సిఫారసు చేసి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిష్టరులో నమోదులు చేయాలని, దరఖాస్తు దారులకు రశీదులు జారీ చేయాలని చెప్పారు. రిజిష్టరులో నమోదులు ప్రక్రియను తహసిల్దారులు పరిశీలన చేయాలని చెప్పారు. సోమవారం నుండి అన్ని టీములు ఉదయం 8 గంటలకే గ్రామాలకు వెళ్లాలని, రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. క్లెయిమ్స్ మాత్రమే తీసుకోవాలని, విచారణ ప్రక్రియ చేపట్టొద్దని ఆయన పేర్కొన్నారు. ధరణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును, డిఆర్డీ అశోక్ చక్రవర్తికి సూచించారు. ధరణి ప్రత్యేక పర్యవేక్షణకు కలెక్టరేట్ నందు ప్రత్యేక అధికారిని నియమించాలని, వారంలో అన్ని దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి మండలంలో నిషేదిత జాబితాలో ఉన్న భూముల వివరాలు నమోదులు చేయాలని చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, అన్ని మండలాల తహసిల్దారులు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post