పోడు భూములకు త్వరలోనే పరిష్కారం…

ప్రచురణార్థం

పోడు భూములకు త్వరలోనే పరిష్కారం…

మహబూబాబాద్, సెప్టెంబర్ 20.

పోడు భూములకు త్వరలోనే పరిష్కారం లభించనున్నదని ఉండదని రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు సత్యవతి రాథోడ్ తెలిపారు.

సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ శశాంక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డోర్నకల్ మహబూబాబాద్ ములుగు శాసనసభ్యులు రెడ్యా నాయక్ శంకర్ నాయక్ ధనసరి అనసూయ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడం పై సభ్యులందరూ ముక్తకంఠంతో ఆమోదం తెలపాలన్నారు అదేవిధంగా దళితుల అభ్యున్నతికి దళిత బంధు పథకం రాష్ట్రంలో హుజురాబాద్ లో ప్రారంభించిన మరో నాలుగు జిల్లాలు ఎంపిక చేయడం హర్షించదగిన విషయం అన్నారు ఈ పథకం క్రింద ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున అందిస్తున్నందున వారి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలని కోరుకోవాలన్నారు.

పోడు భూముల సమస్యలపై త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వయంగా పరిష్కరిస్తానని చెప్పినట్లు మంత్రి తెలియజేశారు.

సర్వసభ్య సమావేశంలో తొలి అంశంగా వైద్యశాఖపై జరిగింది. జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుండి 243 సెంటర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టగా 161 సబ్ సెంటర్లలోని 82 వార్డులలో 100% వ్యాక్సినేషన్ చేపట్టడం జరిగిందన్నారు జిల్లాలో 91% టీకాలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలో 18 సంవత్సరములు నిండిన వారు 5 లక్షల 43 వేల మంది ఉన్నారని వారిలో రెండు లక్షల తొంభై వేల మందికి వ్యాక్సినేషన్ వేయగా 53.5 శాతం జరిగిందన్నారు.

ప్రతిరోజు 24 వేల మంది కి ఇచ్చే లక్ష్యంగా పెట్టుకొని 15 రోజుల్లో పూర్తి చేయనున్నామన్నారు ఆశలు అంగన్వాడి కార్యకర్తలు పంచాయత్ సెక్రటరీలు బృందంగా ఏర్పడి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన ఇంటికి స్టిక్కరింగ్ చేస్తున్నారని తెలిపారు.

జిల్లాలో 19 మలేరియా 23 డెంగ్యూ కేసులు ఉన్నాయని చికెన్గున్యా లేదన్నారు జాతీయ ఫీవర్ సర్వే చేస్తున్నామని గిరిజన ప్రాంతాల్లో 18 వేలకు పైగా దోమతెరలు పంపిణీ చేసినట్లు తెలియజేశారు.

ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం ప్రజాప్రతినిధుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ ప్రభావిత గ్రామాలలో ప్రతిరోజు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు జిల్లాలో తెలంగాణ డయాగ్నస్టిక్ ద్వారా 57 టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డెంగ్యూ ఎలిసా టెస్టులు కూడా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

విద్యాశాఖ పై మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నా లేకపోయినా ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధి నిర్వహణ లో సమయాన్ని పాటించాలన్నారు విద్యార్థులకు టెస్ట్ బుక్స్ అందజేశామని జిల్లాలో 70 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనూ 32 వేల మంది ప్రైవేటు పాఠశాలల్లో నమోదయినట్లు తెలియజేశారు విద్యార్థులు లేరని పాఠశాలకు హాజరు కాకపోవడం సరికాదన్నారు పాఠశాలలకు నిర్ణీత సమయంలో హాజరు కాని ఉపాధ్యాయులపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని ఇంటింటి సర్వే చేస్తూ ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తయిన జిల్లాగా త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు.

డోర్నకల్ శాసనసభ్యుడు రెడ్యా నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో 7 మెడికల్ కళాశాలల్లో మనజిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేయడం అదృష్టంగా భావించాలన్నారు. పోస్ట్ మార్టం కు వైద్యుల కొరత ఉన్నందున చర్యలు తీసుకోవాలన్నారు.ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మహబూబాబాద్ శాసనసభ్యుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ …
ప్రభుత్వ శాఖలతో తన నియోజక వర్గంలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

ములుగు శాసన సభ్యురాలు దనసరి అనసూయ (సీతక్క)మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలన్నారు.
278 సర్వే నెంబర్ లో1965 నుండి పోడు వ్యవసాయం చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఈ సర్యసభ్య సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, శిక్షణ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జడ్పీ సీఈఓ రమాదేవి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post