పోడు భూములను సాగుచేస్తున్న రైతులు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి…

ప్రచురణార్ధం

పోడు భూములను సాగుచేస్తున్న రైతులు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి…

మహబూబాబాద్, నవంబర్,8.

పోడు భూములను సాగుచేస్తున్న రైతులు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

సోమవారం కలెక్టర్ గంగారం, కొత్తగూడ మండలాల్లో పర్యటించి పోడు భూములను సాగుచేస్తున్న రైతులతో హక్కు పొందేందుకు అవాసాల వారీగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

ముందుగా గంగారం మండలం కొడిశలమిట్టలో పోడు భూములు, అటవీ సంరక్షణ సమావేశ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. 15 మందితో ఏర్పాటైన కమిటీ తో మాట్లాడారు.12గ్రామాలలోని 31 అవాసాల పరిధిలో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోడు చేస్తున్న గిరిజన రైతులు డిసెంబర్,2005 కు ముందు వ్యవసాయం చేస్తూ తగిన ఆధారాలను సరైన సమయంలో సమర్పించలేక హక్కు పొందలేనివారికి చక్కని అవకాశంగా పేర్కొన్నారు.
తరతరాలుగా పోడు సాగు చేసుకుంటున్న వారు ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని, కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని, లేనిపక్షంలో మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు.

గిరిజనేతరులు 90 సంవత్సరాలు గా 1930 నుండి పోడు సాగు చేస్తున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు.

పోడు వ్యవసాయ రైతులు పులసం నాగేశ్వరరావు, గుంట బుచ్చి రాములు సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. మండల కార్యాలయం వద్ద గిరిజన రైతులతో మాట్లాడారు.

అనంతరం కొత్తగూడ మండలం పొలారం గ్రామంలో పోడు భూములు అటవీ సంరక్షణ సమావేశం లో పాల్గొన్నారు. 24 గ్రామ పంచాయతీలు 53 ఆవాసాలలో గ్రామ కమిటీలు దరఖాస్తు సేకరించడమే కాక అవగాహన కల్పిస్తారు. అటవీ హక్కు చట్టం పారదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేస్తుందన్నారు ఆవాసాల వారీగా దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్న నందున అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న వారికి న్యాయం చేకూర్చా లన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అన్నారు.
జిల్లాలోనే 164 గ్రామ పంచాయతీలలో 340 ఆవాస ప్రాంతాలలో దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని దరఖాస్తులు నింపేందుకు కూడా ఆయా గ్రామాల్లో ఉపాధ్యాయులను ఏర్పాటు చేశామని తెలియజేశారు

ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దిలీప్ కుమార్ కొత్తగూడ మండల ప్రత్యేక అధికారి సూర్యనారాయణ గంగారం కొత్తగూడ తాసిల్దార్ లు సూర్య నారాయణ నరేష్ ఎంపీడీవోలు శ్యాంసుందర్ కరణ్ సింగ్ ఎఫ్ బి ఓ ఆదినారాయణ గ్రామ కమిటీల చైర్మన్లు ఈక బిక్షం వజ్జా నరసయ్య ఎంపీపీ సరోజ జడ్పిటిసి రమ సర్పంచు పులసం లక్ష్మి, పంచాయతీ సెక్రటరీలు గణేష్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారి జారీ చేయడమైనది

Share This Post