పోడు భూముల దరఖాస్తుల పరిశీలనపై అధికారులతో సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.   తేది: 17 .11 .2021
వనపర్తి

పోడు భూముల కొరకై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో పోడు భూముల దరఖాస్తుల పరిశీలన పై అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా  వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 3053 దరఖాస్తులు వచ్చాయని, ఎస్టీలకు ప్రాధాన్యతనిచ్చి మూడు రోజులలో సర్వే పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, డిఎఫ్ఓ రామకృష్ణ, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post