పోడు భూముల దరఖాస్తుల స్వీకారణ పారదర్శకంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

పోడు భూముల దరఖాస్తుల స్వీకారణ పారదర్శకంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.
పోడు భూములు సాగు చేస్తూ హక్కులు పొందని రైతులు అందరి దరఖాస్తు స్వీకరించాలని కలెక్టర్ అటవీ, రెవెన్యూ శాఖ అధికారులను సూచించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పై ఫారెస్ట్, ఐ.టి.డి.ఏ, తహశీల్దార్లు, ఎంపిడిఓ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క లబ్దిదారుడు నాకు దరఖాస్తు చేరుకునే అవకాశం ఇవ్వలేదు, నాకు తెలియదు అనే మాట రాకుండా అర్హుడను అనుకునే ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. అంతకు ముందు ఎఫ్.ఆర్.సి టీమ్ సభ్యులకు పోడు భూముల దరఖాస్తు స్వీకరణ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అవసరమైతే మండల స్తాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా ఎఫ్.డి.ఓ ను ఆదేశించారు. ఎన్ని రకాల దరఖాస్తు ఫారాలు ఉంటాయి, ఎవరు ఏ దరఖాస్తు ఇవ్వాలి, వాస్తవంగా సాగులో ఉన్న భూమి ఎంత దరఖాస్తు ఇంతకు పెట్టుకుంటున్నారు, నిజమైన లబ్దిదారుడేనా కాదా వంటి అన్ని వివరాలు సరిగ్గా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎఫ్.ఆర్.సి టీమ్ సభ్యులపై ఉంటుందన్నారు. దరఖాస్తు పూర్తిగా నింపడం, కావాల్సిన ఆధార ప్రతులు జాతచేయడం వంటివి క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. దర్సఖాస్తు తీసుకొని అందుకు సంబంధించిన రసీదును లబ్దిదారునికి విధిగా ఇవ్వాలని, రిజిస్టర్ పెట్టాలని సూచించారు. అదేవిధంగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని దరఖాస్తులు వచ్చిన అనంతరం డివిజన్ స్థాయిలో అర్హతలు పరిశీలించడం జరుగుతుందన్నారు. 13 మండలాల్లోని 66 గ్రామపంచాయితీలు, 81 హాబీటేషన్లలో ఈ నెల 11వ తేదీ వరకు 1300 ల మంది రైతుల నుండి 4283 ఎకరాలకు దర్సఖాస్తులు స్వీకరించడం జరిగిందని, గడువు లోపల మొత్తం దరఖాస్తులు తీసుకునే విధంగా క్షేత్రస్థాయిలో తిరగాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన గ్రామ పంచాయతీలు, హాబీటేషన్లలోనే కాకుండా కొత్త హాబీటేషన్లు, గ్రామపంచాయితీల నుండి దరఖాస్తులు వచ్చినా తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి. డి.ఎఫ్.ఓ కిష్టా గౌడ్, పి.ఓ. ఐ.టి.డి.ఏ అశోక్, ఎఫ్.డి.ఓ నవీన్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post