పోడు భూముల పరిష్కారానికి ఈ నెల 8వ తేదీ నుండి క్షేత్ర స్థాయిలో హాబీటేషన్ల వారిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు

పోడు భూముల పరిష్కారానికి ఈ నెల 8వ తేదీ నుండి క్షేత్ర స్థాయిలో హాబీటేషన్ల వారిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.  శుక్రవారం సాయంత్రం పోడు భూముల పై వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా  జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం పోడు భూముల క్లెయిమ్ పరిష్కరించేందుకు మార్పు చేసిన దరఖాస్తు ప్రొఫార్మ అన్నీ జిల్లాలకు ఆన్లైన్ లో పెట్టడం జరిగిందన్నారు. నిర్ణిత ప్రొఫార్మ ప్రింటింగ్ చేయించి అన్ని ఎంపిక చేసిన   గ్రామ కమిటీలకు పంపించి 8వ తేదీ నుండి హాబీటేషన్లలో పర్యటించి పోడు భూములు క్లైమె చేస్తున్న రైతులకు దరఖాస్తు పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  ఫారం ఎలా నింపాలి, క్లైమ్ పొందేందుకు రైతులు జత పర్చాల్సిన పత్రాలు ఏమిటి, ద్వారా వారు ఏ విధంగా హక్కుదారులు ఏ విధంగా నిరూపణ చేసుకోవాలి అనే వాటిపై పూర్తి అవగాహన కల్పించి ప్రొఫార్మాలు అందజేయాలన్నారు.  రెండు మూడు రోజులకు మళ్ళీ వెళ్లి పూరించిన దరఖాస్తులను సేకరించి పంపాల్సిందిగా సూచించారు.  తద్వారా పరిష్కారానికి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి  మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలో ఇప్పటికే పోడు భూముల పై అన్ని పార్టీలతో ఆలపార్టీ సమావేశం నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు.  మండల స్థాయిలో అధికారులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు.  జిల్లాలోని మొత్తం 12 గ్రామ పంచాయతీల్లో పోడు భూమి క్లైమ్ లు గుర్తించడం జరిగిందని అన్నారు.  ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున 12  గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేసారు.  ఈ నెల 8వ తేదీ నుండి హాబీటేషన్ల వారిగా అవగాహన కార్యక్రమం చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలియజేసారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో    వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, జిల్లా నుండి  ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ్ రావు, అర్దిఒ వెంకటేశ్వర్లు, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post