పోడు భూముల పైన ప్రజలకు అవగాహన కల్పించాలి.జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

వార్త ప్రచురణ :
ములుగు జిల్లా :
శని వారం 06( నవంబర్)

పోడు భూములకు ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాలను అందించుటకు గ్రామ సభల ద్వారా పోడు రైతుల నుంచి క్రమ పద్ధతిలో దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అ నారు. శనివారం రోజున తాడ్వాయి ఫారెస్ట్ ఆఫీస్ లో జిల్లా ఫారెస్ట్ అధికారులు పోడు భూముల పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పొడు భూముల విషయంలో గైడ్ లైన్స్ , క్లైమ్స్ తీసుకునే విధానం లో పాటించవలసిన నిబంధనల గురించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్లైమ్స్ ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు నని, పొడు భూముల పరిష్కారానికి FRC కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కొక్క టీం లో 10 నుండి 15 మెంబెర్స్ తో టీమ్ ఏర్పాటుచేయడం జరిగిందని పంచాయితీ సెక్రటరీ, వీఆర్వో లు ఉంటారని, కమిటీ సభ్యులతో కోఆర్డినేట్ చేయాలని అన్నారుపోడు భూముల పైన ప్రజలకు అవగాహన కల్పించాలి. అదేవిధంగా కొత్త గా అటవీ భూములు ఆక్రమించకుండా చూసుకోవలసినదిగా జిల్లా కలెక్టర్ అన్నారు. ఎవ్వరైనా అటవీ భూమిని ఆక్రమించినట్లు అయితే అటవీ హక్కు చట్టం కింద కేసులు పెట్టడం జరుగుతుందని ముందుగా ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

జిల్లాలో 77% ఫారెస్ట్ ఉందని, దానిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిదని అన్నారు. గ్రామాల్లో కొత్తగా 2007,2008, 2009లలో హక్కు పత్రాలు ఇచ్చి ఉన్నట్లు అయితే వాటి పూర్తి సమాచారం ఉండాలన్నారు.
జిల్లలో 27 గ్రామాలలో ఎక్కువగా అటవీ భూములు ఆక్రమణ అయినట్లుగా ఉందని, వాటి వివరాలు తప్పని సరిగా ఉండాలి అన్నారు. ఆయా గ్రామాలలో భూముల వివరాలు మ్యాప్,గెజిట్ వారి వారి గ్రామ పంచాయితీ పరిది లో ఉంటాయని, ఫారెస్ట్ చట్టాలను ప్రజలకు తెలియ జేయవసిన బాధ్యత మీదే నని అన్నారు. ఇప్పటి వరకు ఆక్రమించిన భూమి వివరాలతో పాటు,ఇంకముందు అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా చూడాలి అని అన్నారు.

జిల్లాలోని 110గ్రామ పంచాయితీలలో 210 FRC టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని,ఎవ్వరివద్ద ఐన పోడు భూమి ఉన్నట్లు అయితే వారఅందరికీ క్లెయిమ్ చేసుకునే అధికారం ఉంటుందని కలెక్టర్ అన్నారు. క్లెయిమ్ దరకాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం ఫారం-A నమూనా ఫారం తయారు చేసిందని,దానిని క్లైమ్ దారునికి ఇస్తూ దానిలో పూరించవలసిన కాలమ్స్ అన్ని పూర్తి వివరాలు పూరించే విధంగా తెలియజేయాలని, క్లైమ్ దారుడు ఇస్తున్న క్లెయిమ్ దరకాస్తు తో పాటు జిరాక్స్ ప్రతుల డాక్యుమెంట్లతో పూర్తి సమాచారం మరియు వారి చుట్టూ పక్కల ఎవరి స్థలం ఉంది అనే విషయం పైన పూర్తి వివరాలు సమర్పించ వలసి ఉంటుందని, అట్టి వివరాల పైన ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పోడుభూమి ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క గ్రామంచాయతీలో మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి,ఫారెస్ డివిజనల్ అధికార్లు, ప్రశాంత్ పాటిల్, అశీస్, గోపాలరావు, రవీందర్,ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post